Telangana: ఇంటర్ ఫస్టియర్ బ్యాక్‌లాగ్స్ ఉంటే 35 శాతం మార్కులతో పాస్.. ప్రాక్టికల్స్‌లో ఫుల్ మార్క్స్.. గైడ్‌లైన్స్ ఇవే..
తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు ఖరారు చేసింది. కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో..
తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు ఖరారు చేసింది. కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంటర్ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. ఫస్టియర్ విద్యార్థులను నేరుగా సెకండియర్‌కి ప్రమోట్ చేయగా.. ద్వితీయ సంవత్సర విద్యార్థులకు సంబంధించి ఫలితాలను వెల్లడించనుంది. ఈ నేపథ్యంలో సెకండియర్ విద్యార్థులకు మార్కులు ఎలా వేయాలన్న దానిపై తెలంగాణ విద్యా శాఖ గైడ్‌లైన్స్ రూపొందించింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో వచ్చిన మార్కులనే పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. ఆయా సబ్జెక్టుల్లో మొదటి ఏడాది మార్కులే రెండో ఏడాదికి కేటాయించనున్నట్లు ప్రకటించింది. ఇక ప్రాక్టికల్స్ విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాక్టికల్స్‌కు పూర్తి మార్కులు (100 శాతం మార్కులు) ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇంటర్ మొదటి సంవత్సరంలో బ్యాక్‌లాగ్స్ ఉన్నవారు సెకండ్ ఇయర్ పరీక్షలతో కలిపి ఆ ఎగ్జామ్స్ రాద్దామనుకున్నారు. కానీ ఎగ్జామ్స్ రద్దు కావడంతో బ్యాక్ లాగ్స్ ఉన్నవారిని కూడా 35 శాతం మార్కులతో పాస్ చేయాలని తెలంగాణ విద్యా శాఖ నిర్ణయించింది. బ్యాక్ లాగ్స్ ఫీజు చెల్లించినవారందరినీ 35 శాతం మార్కులతో పాస్ చేస్తామని తెలిపింది. ఫలితాలతో సంతృప్తి చెందని విద్యార్థులకు పరిస్థితులు మెరుగయ్యాక ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శికి విద్యాశాఖ కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు.
తాజాగా.. సెకండ్ ఇయర్ విద్యార్థులకు మార్కుల కేటాయింపు విషయంలో మార్గదర్శకాలు రూపొందించడంతో త్వరలోనే ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల కానున్నాయి. సుమారు 4.50 లక్షల మంది విద్యార్థులు రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు.
Also Read: ‘మా’ అధ్యక్ష పోరులో మరో మహిళ.. రేస్‌లోకి సీనియర్ నటి హేమ
బ్యాంక్ లాకర్‌కు మరమ్మత్తు చేశాడు.. కన్నం వేశాడు.. ! కానీ ఎక్కడ బెడిసికొట్టిందంటే..?