AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nellore Crime News: ‘పనిమనిషి ఉంటేనే ఇంట్లో ఉంటాను..’ భార్యా, కుమారుడిని ఇంట్లో పెట్టి తాళం వేసిన ప్రొఫెసర్‌

నెల్లూరులో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రొఫెసర్‌ తన భార్యా.. కుమారుడిని ఇంట్లో నిర్బంధించడం కలకలం రేపింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Nellore Crime News: 'పనిమనిషి ఉంటేనే ఇంట్లో ఉంటాను..' భార్యా, కుమారుడిని ఇంట్లో పెట్టి తాళం వేసిన  ప్రొఫెసర్‌
Nellore Professor Harassment
Ram Naramaneni
|

Updated on: Jun 23, 2021 | 5:28 PM

Share

నెల్లూరులో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రొఫెసర్‌ తన భార్యా.. కుమారుడిని ఇంట్లో నిర్బంధించడం కలకలం రేపింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఆయన బాగా చదువుకున్నాడు. ప్రొఫెషనల్‌గానూ స్థిరపడ్డాడు. స్టూడెంట్స్‌కు పాఠాలు చెప్పే ప్రొఫెసర్‌ వృత్తిలో కొనసాగుతున్నాడు. అంతా బాగానే ఉన్నా ఆయన ప్రవర్తన పశువును తలపిస్తోంది. అతని బుద్ధి ప్రొఫెసర్‌ వృత్తికే కళంకం తెచ్చిపెట్టింది. ఏకంగా తన భార్యతో పాటు కుమారుడిని ఇంట్లో నిర్బంధించి తన సైకోయిజాన్ని చూపాడు ఆ ప్రొఫెసర్‌. నెల్లూరు విక్రమసింహపురి యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు చెంచురెడ్డి. బాలాజీనగర్‌ ప్రాంతంలో భార్యా కుమారుడితో కలిసి నివసిస్తున్నాడు. ఇటీవల వీరి ఇంట్లో పనిచేసేందుకు వచ్చిన మహిళతో ప్రొఫెసర్‌కు సంబంధం ఏర్పడింది. వీరి విషయం తెలుసుకున్న భార్య పనిమనిషిని బయటకు పంపించడంతో కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. పనిమనిషి ఉంటేనే తాను ఇంట్లో ఉంటానని తెగేసి చెప్పిన ప్రొఫెసర్‌.. భార్యా, కుమారుడిని ఇంట్లో పెట్టి తాళం వేసి బయటకు వెళ్లిపోయాడు.

స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు వీరిని బయటకు తీసుకొచ్చారు. అక్రమ సంబంధం కారణంగానే తమను నిర్బంధించారని భార్య నెల్లూరు దిశ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.  నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన ప్రొఫెసర్‌ బాధ్యత మరిచి ప్రవర్తించడం విస్మయానికి గురిచేస్తోంది. పనిమనిషి కోసం కుటుంబసభ్యుల్ని వేధించడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటివారా..? పిల్లలకు విద్యాబుద్దులు నేర్పేదని ఫైరవుతున్నారు.

Also Read: ‘మా’ అధ్యక్ష పోరులో మరో మహిళ.. రేస్‌లోకి సీనియర్ నటి హేమ

ఇంటర్‌ ఫస్టియర్ బ్యాక్‌లాగ్స్‌ ఉంటే 35 శాతం మార్కులతో పాస్‌.. ప్రాక్టికల్స్‌లో ఫుల్ మార్క్స్.. గైడ్‌లైన్స్‌ ఇవే..