Nellore twins death: అనుమానాస్పద స్థితిలో 10 నెలల వయసున్న కవలల మృతి.. పోలీసులు విచారణలో విస్తుపోయే విషయాలు..!

ఎంతో ముద్దుగా ఉండే ా ఇద్దరు కవలలు ఇపుడు ప్రాణాలతో లేరు. పాల బుగ్గల చిన్నారుల ఉసురు పాలతోనే తీసేసారు. తాగే పాలలో విషం కలిపి చంపేశారు. ఈ నెల 20 మధ్యాహ్నం మనుబోలు మండలం రాజవోలు పాడు గ్రామంలో...

Nellore twins death: అనుమానాస్పద స్థితిలో 10 నెలల వయసున్న కవలల మృతి.. పోలీసులు విచారణలో విస్తుపోయే విషయాలు..!
Nellorre Twins Death
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 23, 2021 | 6:56 PM

ఎంతో ముద్దుగా ఉండే ా ఇద్దరు కవలలు ఇపుడు ప్రాణాలతో లేరు. పాల బుగ్గల చిన్నారుల ఉసురు పాలతోనే తీసేసారు. తాగే పాలలో విషం కలిపి చంపేశారు. ఈ నెల 20 మధ్యాహ్నం మనుబోలు మండలం రాజవోలు పాడు గ్రామంలో పుడ్ పాయిజన్ అయిందంటూ 10 నెలల వయసున్న ఈ ఇద్దరు చిన్నారులను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. ఫలితంగా ఆ ఇంట్లోనే కాదు ఆ ఊళ్లోను విషాదం. అప్పుడప్పుడే మొదలైంది చర్చ. ఈ పిల్లల తల్లిదండ్రులకు నిత్యం గోడవలట కదా అని.. ఊహించనిది ఏమైనా జరిగి ఉంటుందా.. ఏమో.. అలా ఊళ్ళో మొదలైన అనుమానం పోలీసుల దాకా వెళ్ళింది. పిల్లల తల్లిదండ్రుల వైఖరి వారి అనుమానాలకు బలం చేకూర్చింది. దంపతుల ఇద్దరి మధ్య గత కొంతకాలంగా మనస్పర్థలు.. గొడవలు జరుగుతున్నాయి. దీంతో పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు. అప్పటి దాకా అనుమానం ఉన్న వారు పూర్తిగా విచారిస్తున్నారు. అంతే ఒక్కసారిగా సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.

చిన్నారుల తల్లిదండ్రులు పుట్టా వెంకటరమణయ్య, నాగరత్నమ్మకు రెండేళ్ల కిందట పెళ్లైయింది. వీరికి ఇద్దరు ఆడ కవల పిల్లలు జన్మించారు. కుటుంబ కలహాలతో ఏడాది క్రితం భార్య, భర్తలు ఇద్దరు విడిపోయారు. పెద్దలు సర్ది చెప్పడంతో కొద్ది రోజుల నుండి ఇద్దరు కలిసి ఉంటున్నారు. మళ్లీ కలిసినా ఇరువురి మధ్య రోజు గొడవలు జరుతూనే ఉన్నాయి. ఫలితంగా ఆ దంపతులకు పోలీసులు కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. అయినా గొడవలు తగ్గలేదు. ఈ లోపే చిన్నారుల మృతి చెందారు. అంతే అందరికీ వారి పైనా అనుమానాలు వచ్చాయి. తమదైన శైలిలో పోలీసులు విచారణ మొదలుపెట్టారు. భార్యాభర్తలు నివాసం ఉంటున్న ఇంటిని పరిశీలించారు.. అక్కడ అనుమానాస్పదంగా ఉన్న కొన్ని పదార్ధాలను గుర్తించారు. పాలలో రంగు మారడాన్ని గుర్తించిన పోలీసులు వాటిని సీజ్ చేసి FSLకు పంపారు. ఇంటి పక్కనే రంగు మారిన పాలను పారబోసిన ప్రాంతంలో మట్టిని నమూనాలను కూడా పోలీసులు సేకరించారు..

చిన్నారుల మృతికి వారు తాగించిన పాలల్లో విషమే కారణమని నిర్ధారణకు వచ్చారు పోలీసులు. విషం అవశేషాలు ఉండడంతో హత్య చేసినట్లు దాదాపు కన్ఫర్మ్ చేసుకున్నారు. ప్రమాదవశాత్తు ఏదైనా విషం లాంటి పదార్ధాలను తీసుకునే వయస్సు కాదు ఆ చిన్నారులది. తల్లిదండ్రుల మధ్య గొడవే చిన్నారులను బలి తీసుకుందని అనుమానిస్తున్నారు. అయితే ఆ కర్కశ మనసున్న వ్యక్తి ఎవరు. భర్త వెంకట రమణయ్య తన భార్య హత్య చేసిందని అంటున్నారు. మరోవైపు భార్యనేమో తన భర్తే ఇదంతా చేశాడని అంటోంది.. కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఒక సిఐ, ఇద్దరు ఎస్సై లతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.. గూడూరు డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి మొత్తం కేసును దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు.

పిల్లలు చనిపోతే బాధ్యత లేకుండా తల్లి తన అమ్మగారి ఇంటికి వెళ్లి పోయిందంటున్నారు మరోవైపు వెంకట రమణయ్య కుటుంబ సభ్యులు. పొలాలకు వేసే గుళికలు పాలల్లో కలిపి ఉంటుందని కుటుంబ సభ్యుల అనుమానం వ్యక్త చేస్తున్నారు. చిన్నారుల మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తి కావడంతో FSL రిపోర్ట్ వచ్చాక స్పష్టత వస్తుందంటున్నారు పోలీసులు.

Also Read: కరోనా వ్యాక్సిన్ వేసుకున్నవారికి ఇండిగో ఎయిర్‌లైన్స్ బంపర్ ఆఫర్

‘పనిమనిషి ఉంటేనే ఇంట్లో ఉంటాను..’ భార్యా, కుమారుడిని ఇంట్లో పెట్టి తాళం వేసిన ప్రొఫెసర్‌