uppula Raju |
Updated on: Jun 23, 2021 | 6:49 PM
తెల్ల జింక ఫోటో చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. దీనివల్ల నిజంగా తెల్ల జింకలు ఉన్నాయా అని అడుగుతున్నారు. ఈ జింక ఇప్పుడు ప్రజలలో చర్చనీయాంశంగా మారింది.
'కాజీరంగ నేషనల్ పార్క్‌లో కనిపించే అరుదైన వైట్ హాగ్ జింకల చిత్రాలను ఐఎఫ్‌ఎస్ అధికారి సుశాంత నందా ట్విట్టర్‌లో షేర్ చేశారు.
కాజీరంగ నేషనల్ పార్క్ DFO రమేష్ గొగోయ్ మాట్లాడుతూ.. ఈ అరుదైన తెల్ల జింకను కొన్ని రోజుల క్రితం పార్కులో మొదటిసారి చూశానని ఇది చాలా అరుదుగా పార్క్ నుంచి బయటకు వచ్చి గోధుమ జింకలతో తిరుగుతుందని తెలిపారు.
సమాచారం ఇస్తూ జింక తెలుపు రంగు పూర్తిగా జన్యుపరమైనదని ఇది జన్యువులో మార్పు కారణంగా ఉందని తెలిపారు.
కాజీరంగలోని మొత్తం 40,000 హాగ్ జింకలలో ఒకటి లేదా రెండు రకాల అరుదైన వైట్ హాగ్ జింకలను మాత్రమే కనుగొనవచ్చని తెలిపారు.