AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఢిల్లీలో 350 కేజీల హెరాయిన్ పట్టివేత..నలుగురి అరెస్ట్..అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ ఎంతంటే ..?

ఢిల్లీ పోలీసు శాఖలోని ప్రత్యేక విభాగం శనివారం 350 కేజీల నిషిద్ధ హెరాయిన్ ని స్వాధీనం చేసుకుంది. అంతర్జాతీయ మార్కెట్ లో దీని విలువ 2,500 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి నలుగురిని అరెస్టు చేశామని, వీరిలో ముగ్గురు హర్యానాకు..

ఢిల్లీలో 350 కేజీల హెరాయిన్ పట్టివేత..నలుగురి అరెస్ట్..అంతర్జాతీయ మార్కెట్లో దీని  విలువ ఎంతంటే ..?
Delhi Police Bust Major Drug Rocket 350 Kgs Heroin Seized,rs.2500 Crores,4 Arrested,afghanistan,mumbai,delhi,punjab
Umakanth Rao
| Edited By: Anil kumar poka|

Updated on: Jul 10, 2021 | 5:01 PM

Share

ఢిల్లీ పోలీసు శాఖలోని ప్రత్యేక విభాగం శనివారం 350 కేజీల నిషిద్ధ హెరాయిన్ ని స్వాధీనం చేసుకుంది. అంతర్జాతీయ మార్కెట్ లో దీని విలువ 2,500 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి నలుగురిని అరెస్టు చేశామని, వీరిలో ముగ్గురు హర్యానాకు, ఒకరు ఢిల్లీకి చెందినవారని వారు చెప్పారు. (అయితే వీరిలో ఓ ఆఫ్ఘన్ దేశీయుడు, ఒకడు జమ్మూ కాశ్మీర్ కు, మరొకడు పంజాబ్ కు చెందినవాడని మరికొన్ని మీడియా సంస్థలు పేర్కొన్నాయి). ఇంత భారీ ఎత్తున డ్రగ్ ని స్వాధీనం చేసుకోవడం ద్వారా ఓ ఇంటర్నేషనల్ డ్రగ్ సిండికేట్ గుట్టును రట్టు చేశామని వారు వెల్లడించారు. ఇప్పటివరకు ఇంత పెద్ద డ్రగ్ రవాణాను పట్టుకోవడం ఇదే మొదటిసారన్నారు. ప్రస్తుతం నార్కో-టెర్రరిజం కోణంలో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.కొన్ని నెలలుగా ఈ డ్రగ్ దందా సాగుతోందని, ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఈ హెరాయిన్ మొదట ముంబైకి, ఆ తరువాత సముద్ర మార్గం ద్వారా సీక్రెట్ కంటెయినర్లలో ఢిల్లీకి చేరిందని స్పెషల్ సెల్ చీఫ్ నీరజ్ ఠాకూర్ తెలిపారు. మధ్యప్రదేశ్ లోని శివపురి దగ్గర గల ఓ ఫ్యాక్టరీ లో ఈ హెరాయిన్ ని మరింత శుద్ధి (ప్రాసెస్) చేస్తారని, దీన్ని రహస్యంగా దాచేందుకు ఫరీదాబాద్ లో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారని ఆయన చెప్పారు.

పంజాబ్ కు సప్లయ్ చేసేందుకు ఈ డ్రగ్ ని ఉద్దేశించారని, దీని రవాణాకు అవసరమైన డబ్బు పాకిస్థాన్ నుంచి అందుతున్నట్టు భావిస్తున్నామని నీరజ్ ఠాకూర్ పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్థాన్ లో అసలైన సూత్రధారి ఉన్నాడని, ఈ సిండికేట్ అతని ఆధ్వర్యంలోనే కొనసాగుతున్నట్టు తెలుస్తోందని ఆయన చెప్పారు. గతనెలలో కూడా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో 22 లక్షల నిషిద్ధ సైకోట్రోపిక్ టాబ్లెట్స్ ను, 245 కేజీల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుంది.

మరిన్ని ఇక్కడ చూడండి  : మాస్క్ లేదంటే బాదుతున్న బుడ్డోడు..! పట్టించుకోని పర్యాటకులు..వైరల్ అవుతున్న చిన్నారి వీడియో :Little Boy In Dharamshala Video.

 Poisonous Snakes dowry : వింత ఆచారం..వరకట్నంగా 21 విష సర్పాలు! కూతురి పెళ్లి చేస్తే మామగారుఇవ్వాలంట..వైరల్ వీడియో.

 Shivaji Raja New Look : అయ్యో.. శివాజీ రాజాకు ఏమైంది..?హీరోగా ఎంట్రీ ఇస్తోన్న శివాజీరాజా తనయుడు..(వీడియో).

 మందేసిన ఎలుకలు 12 సీసాలు ఖాళీ..!మందుబాబులు జాగ్రత్త పోటీకు రెడీగా..వైరల్ అవుతున్న వీడియో : Rats Drunk video.