UP Crime Video: ప్రేమించిన పాపానికి..యూపీలో మరో దారుణం..దళిత యువకుడిపై దాడి..స్తంభానికి కట్టివేసి..

ఉత్తరప్రదేశ్ లో మరో దారుణం జరిగింది. అందరూ చూస్తుండగానే సుమారు 20 ఏళ్ళ దళిత యువకుడి జుట్టు పట్టుకుని లాగి.. పిడి గుద్దులు గుద్దుతూ..కాళ్లతో తన్నుతూ అంతటితో ఆగక అతడ్ని ఓ స్తంభానికి కట్టి వేశారు.కర్రలతో అతడి ప్రైవేటు భాగాలపై కొట్టి రాక్షసానందం పొందారు..

UP Crime Video: ప్రేమించిన పాపానికి..యూపీలో మరో దారుణం..దళిత యువకుడిపై దాడి..స్తంభానికి కట్టివేసి..
Dalit Youth Thrashed Hit On Private Parts In Up,up,kanpur Dehat Dist,youth Thrashed,beat,video,one Arrested
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Jul 10, 2021 | 5:28 PM

Hit On Private Parts In UP : ఉత్తరప్రదేశ్ లో మరో దారుణం జరిగింది. అందరూ చూస్తుండగానే సుమారు 20 ఏళ్ళ దళిత యువకుడి జుట్టు పట్టుకుని లాగి.. పిడి గుద్దులు గుద్దుతూ..కాళ్లతో తన్నుతూ అంతటితో ఆగక అతడ్ని ఓ స్తంభానికి కట్టి వేశారు.కర్రలతో అతడి ప్రైవేటు భాగాలపై కొట్టి రాక్షసానందం పొందారు.. వివరాల్లోకి వెళ్తే.. కాన్పూర్ దేహట్ జిల్లాలోని కమాల్ పూర్ గ్రామంలో ఉంటున్న తన గర్ల్ ఫ్రెండును కలుసుకునేందుకు ఈ నెల 8 న శర్వన్ అనే ఈ యువకుడు వెళ్ళాడు. అతడ్ని చూసిన వెంటనే ఆమె తలిదండ్రులు, బంధువులు కోపంతో రెచ్చిపోయారు. అతనికి పబ్లిగ్గా శాస్తి చేయాలనుకుని ఇలా అత్యంత కిరాతకంగా ప్రవర్తించారు. తమ కసి తీరక అతడిని గ్రామం నుంచి గెంటి వేశారు. వీరి అమానుషం వీడియోకెక్కి సోషల్ మీడియాలో వైరల్ అయింది. తనపై జరిగిన ఈ ఘోరమైన దాడి గురించి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి కూడా శర్వన్ భయపడ్డాడు. అయితే వీడియో చూసిన అక్బర్ పూర్ పోలీసులు అతడ్ని పిలిపించి అతని స్టేట్ మెంట్ ఆధారంగా ఆ యువతి తలిదండ్రులు, బంధువులపై ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేశారు.

వారిపై ఎస్సీ,ఎస్టీ చట్టం కింద కేసు పెట్టడమే గాక ఒకరిని అరెస్టు చేశామని , పరారీలో ఉన్న మిగిలినవారికోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు. తీవ్ర గాయాలకు గురైన బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. ఇదే రాష్ట్రంలోని లఖింపూర్ ఖేరి బ్లాకులో స్థానిక ఎన్నికలను పురస్కరించుకుని తన నామినేషన్ వేయడానికి వెళ్తున్న ఓ మహిళ చీర పట్టుకుని లాగి కొందరు యువకులు అసభ్యంగా ప్రవర్తించారు. వీరు బీజేపీ కార్యకర్తలని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.

మరిన్ని ఇక్కడ చూడండి  : మాస్క్ లేదంటే బాదుతున్న బుడ్డోడు..! పట్టించుకోని పర్యాటకులు..వైరల్ అవుతున్న చిన్నారి వీడియో :Little Boy In Dharamshala Video.

 Poisonous Snakes dowry : వింత ఆచారం..వరకట్నంగా 21 విష సర్పాలు! కూతురి పెళ్లి చేస్తే మామగారుఇవ్వాలంట..వైరల్ వీడియో.

 Shivaji Raja New Look : అయ్యో.. శివాజీ రాజాకు ఏమైంది..?హీరోగా ఎంట్రీ ఇస్తోన్న శివాజీరాజా తనయుడు..(వీడియో).

 మందేసిన ఎలుకలు 12 సీసాలు ఖాళీ..!మందుబాబులు జాగ్రత్త పోటీకు రెడీగా..వైరల్ అవుతున్న వీడియో : Rats Drunk video.