Cyclone Biparjoy: బిపర్‌జోయ్ అల్లకల్లోలం.. దూసుకువస్తున్న ముప్పు.. తొమ్మిది రాష్ట్రాలకు రెడ్ అలర్ట్..
Cyclone Biparjoy Alert: బిపర్‌జోయ్ తుఫాన్ దెబ్బకు గుజరాత్ వణికిపోతోంది. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ విపత్తుతో ద్వారాకా, సోమనాథ్ ఆలయాలను మూసివేశారు.

Cyclone Biparjoy Alert: బిపర్‌జోయ్ తుఫాన్ దెబ్బకు గుజరాత్ వణికిపోతోంది. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ విపత్తుతో ద్వారాకా, సోమనాథ్ ఆలయాలను మూసివేశారు. ద్వారకా ఆలయ ప్రాంతమంతా నిర్మానుష్యంగా మారింది. కచ్ జిల్లా జఖావు రేవు సమీపంలో తుఫాన్ కేంద్రీకృతం అయింది. తీవ్రరూపం దాల్చిన బిపర్‌జోయ్ దాటికి ముంబై తీరం అల్లకల్లోలలంగా మారింది. సముద్రం నుంచి నీరు బయటకు పొర్లి వస్తోంది. తీవ్రమైన ఈదురుగాలులతో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. వాతావరణ శాఖ ఊహించినట్లుగానే తుఫాన్ తీవ్రతరం అయింది. కచ్ వైపు బిపర్‌జోయ్ తుఫాన్ దూసుకువస్తుండటంతో 9 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీచేశారు.
బిపర్‌జోయ్ తుఫాన్ కచ్ తీరం వైపు దూసుకొస్తుందని.. ఇది బీభత్సం సృష్టించే అవకాశముందని అధికారులు తెలిపారు. తుఫాన్ కారణంగా గుజరాత్ అల్లకల్లోలంగా మారింది. సాయంత్రం 4నుంచి 8గంటల మధ్య బిపర్‌జోయ్ తీరం దాటే అవకాశముంది. అయితే, తీరం దాటే సమయంలో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయంటున్నారు. తుఫాన్ తీవ్ర రూపం దాల్చితే.. సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ త్రివిధ దళాలకు ఆదేశాలు జారీచేశారు. దీంతోపాటు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ.. సలహాలు సూచనలు చేస్తున్నారు.




#WATCH | Gujarat: Dwarka witnesses rough sea conditions and strong winds under the influence of #CycloneBiporjoy
(Visuals from Bhadkeshwar Mahadev Temple) pic.twitter.com/Tyw2kVGOCE
— ANI (@ANI) June 15, 2023
ద్వారకా స్వామి నారాయణ్ ఆలయం సమీపంలో సముద్రం మహోగ్రంగా మారింది. బిపర్‌జోయ్ తుఫాను ప్రభావంతో గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంగా గాలులు వీస్తున్నాయి. దీంతో అరేబియా సముంద్రంలో అల్లకల్లోలం ఏర్పడింది. రాకాసి అలలు తీరం వద్ద ఎగసిపడుతున్నాయి. బిపర్‌జోయ్ తుఫాను ప్రభావంతో గుజరాత్ తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
#WATCH | Gujarat: Dwarka witnesses rough sea conditions under the influence of #CycloneBiporjoy pic.twitter.com/Skje1kDvic
— ANI (@ANI) June 15, 2023
ద్వారక, కచ్, సౌరాష్ట్ర, రాజ్ కోట్, జాంనగర్, పోరుబందర్, గిర్ సోమనాథ్, జునఘడ్ ఏరియాల్లో భారీ వానలు కురుస్తున్నాయి. 54 తాలూకాల్లో 10 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. మిగతా ప్రాంతాల్లోనూ వర్షపాతం 6 సెంటిమీటర్లుగా ఉందన్నారు. అయితే, 70 గ్రామాలకు చెందిన 75 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..




