Rajasthan Poll Result: రాజస్థాన్ సీఎం రేసులో జైపూర్ యువరాణి.. 71వేల మెజారిటీతో గెలుపు.. దియా కుమారీ ఎవరంటే?
రాజస్థాన్‌లో కమలం పార్టీ వికసించింది. ఆదివారం (డిసెంబర్ 3)న వెలువడిన రాజస్థాన్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్థులు మెజారీటీ స్థానాల్లో గెలుపొందారు. మొత్తం 199 స్థానాలకు ఎన్నికలు జరగ్గా 115 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. కాంగ్రెస్ కేవలం 67 స్థానాలకే పరిమితమైంది. ఇక రాజస్థాన్‌లోని విద్యాధర్ నగర్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ అభ్యర్థి, రాజ్‌సమంద్ పార్లమెంటు సభ్యురాలు దియా కుమారి ఘన విజయం సాధించారు.
రాజస్థాన్‌లో కమలం పార్టీ వికసించింది. ఆదివారం (డిసెంబర్ 3)న వెలువడిన రాజస్థాన్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్థులు మెజారీటీ స్థానాల్లో గెలుపొందారు. మొత్తం 199 స్థానాలకు ఎన్నికలు జరగ్గా 115 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. కాంగ్రెస్ కేవలం 67 స్థానాలకే పరిమితమైంది. ఇక రాజస్థాన్‌లోని విద్యాధర్ నగర్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ అభ్యర్థి, రాజ్‌సమంద్ పార్లమెంటు సభ్యురాలు దియా కుమారి ఘన విజయం సాధించారు. ఆమె తన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి సీతారాం అగర్వాల్‌పై ఏకంగా 71,368 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ సందర్భంగా మాట్లాడిన దియా కుమారి రాజస్థాన్‌తో సహా ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ విజయానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ విజనే కారణమన్నారు. ‘మోదీ మాయాజాలం’ ఈ రాష్ట్రాల్లో బాగా ప్రతిధ్వనించిందని, కాషాయ పార్టీని అధికారం వైపు మళ్లించిందని ఆమె ఉద్ఘాటించారు. ‘ఈ విజయం క్రెడిట్ ప్రధాని మోడీ, అమిత్ షా జీ, JP నడ్డా జీ, రాష్ట్ర నాయకులు, పార్టీ కార్యకర్తలందరికీ చెందుతుంది. రాజస్థాన్‌తో పాటు ఛత్తీస్‌గఢ్‌లో కూడా మోడీ జీ మ్యాజిక్ బాగా పనిచేసింది. రాష్ట్రంలో సుపరిపాలన, అభివృద్ధిని అందిస్తాం.. రాష్ట్రంలో ఇప్పుడు శాంతిభద్రతలు కనిపిస్తాయి. సీఎం ఎవరనేది పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయిస్తుంది’ అని దియా కుమారి తెలిపారు.
కాగా రాజస్థాన్ ముఖ్యమంత్రి రేసులో మాజీ సీఎం వసుంధర రాజేతో పాట జైపూర్ రాజకుటుంబానికి చెందిన దియా కుమారి పేరు కూడా బాగా వినిపిస్తోంది. జైపూర్‌ను పాలించిన ఆఖరి మహరాజు మాన్ సింగ్ II మనవరాలైన దియాకుమారి ఢిల్లీ, ముంబై, జైపూర్‌లో విద్యాభ్యాసం చేశారు. లండన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో ఆమె ఫైన్ ఆర్ట్స్ చదివారు. గ్రాడ్యుయేట్ డిప్లామా పూర్తి చేశారు. ఫిలాసఫీలో ఆమె డాక్టరేట్ అందుకున్నారు. 2013లో బీజేపీలో చేరిన దియా కుమారి.. అదే ఏడాది సవాయ్ మాధోపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2019 సాధారణ ఎన్నికల్లో రాజ్సామండ్ నుంచి ఎంపీగా పోటీచేసిన దియాకుమారి సుమారు ఐదున్నర లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇప్పుడు ఎంపీగా కొనసాగుతూనే అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. ఘన విజయం సాధించి ఏకంగా ముఖ్యమంత్రి రేసులో నిలిచారు.
మోడీ మ్యాజిక్ బాగా పనిచేసింది..
भगवामय हुआ राजसमंद !
माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के सुशासन व जनकल्याण नीतियों पर विश्वास जताते हुए मेरे संसदीय क्षेत्र राजसमंद की जनता का संसदीय क्षेत्र की सभी सीटों पर भाजपा को जिताने पर हृदय से आभार।@narendramodi @AmitShah @JPNadda @ArunSinghbjp @JoshiPralhad… pic.twitter.com/x1rmAgLNwI
— Diya Kumari (@KumariDiya) December 3, 2023
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్ :