Uttarkashi: భయపెడుతున్న మరో సొరంగం.! 16 కి.మీ. సొరంగం నుంచి భారీ నీటిప్రవాహం.
ఉత్రరకాశీని టన్నెల్ టెన్షన్ వీడటం లేదు. ఇటీవల ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో నిర్మాణంలో ఉన్న సొరంగం కుప్పకూలిన సంగతి తెలిసిందే. అందులో చిక్కుకున్న 41 మంది కూలీలను సహాయక సిబ్బంది దాదాపు 17 రోజుల పాటు తీవ్రంగా శ్రమించి ఎట్టకేలకు వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఇప్పుడు ఉత్తరకాశీ జిల్లాలో మరో సొరంగం స్థానికులను భయపెడుతోంది. ఈ సొరంగం నుంచి భారీగా నీరు ప్రవహిస్తోంది.
ఉత్రరకాశీని టన్నెల్ టెన్షన్ వీడటం లేదు. ఇటీవల ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో నిర్మాణంలో ఉన్న సొరంగం కుప్పకూలిన సంగతి తెలిసిందే. అందులో చిక్కుకున్న 41 మంది కూలీలను సహాయక సిబ్బంది దాదాపు 17 రోజుల పాటు తీవ్రంగా శ్రమించి ఎట్టకేలకు వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఇప్పుడు ఉత్తరకాశీ జిల్లాలో మరో సొరంగం స్థానికులను భయపెడుతోంది. ఈ సొరంగం నుంచి భారీగా నీరు ప్రవహిస్తోంది. ఈ నీటి ప్రవాహంతో అక్కడి కాలువలు, పంట భూములు దెబ్బతిన్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరకాశీలోని మనేరీ భళి-2 అనే ప్రాజెక్టులో 16 కిలోమీటర్ల వరకు పొడవైన సొరంగం ఉంది. ఈ సొరంగం గుండా నీరు ప్రవహిస్తోంది. ధారసు అనే ప్రాంతంలో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ధారసు సమీపంలో ఉన్న మహర్‌గావ్‌లోని సొరంగం నుంచి రెండేళ్ల క్రితం నీటి లికేజీ మొదలైంది. ఇది క్రమంగా పెరుగుతోంది. యూజేవీఎన్‌ఎల్ ఇప్పటికే దీని మరమ్మతుల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసింది. అయినా లీకేజీ అదుపులోకి రావడం లేదు. గత రెండేళ్ల నుంచి ఇక్కడ నీటి లీకేజీ వేగంగా పెరుగుతోందని గ్రామ పెద్ద సురేంద్రపాల్ చెప్పారు. ఫలితంగా సాగునీటి కాలువ, పలు పంట భూములు దెబ్బతిన్నాయని, పలు చోట్ల భూమి కోతకు గురవుతోందని అన్నారు. ఈ సొరంగానికి తక్షణమే మరమ్మతులు చేయాలని ఆయన కోరారు. కాగా మనేరి భళి సొరంగం నీటి లీకేజీ నివారణకు మరమ్మతులు చేస్తున్నామని, త్వరలోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని యూజేవీఎన్‌ఎల్ ఎండీ సందీప్ సింఘాల్ తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.