Viral: యూపీ అబ్బాయి-నెదర్లాండ్స్ అమ్మాయి ప్రేమ వివాహం.! వీడియో.
ప్రేమకు కళ్లే కాదు... హద్దులు కూడా లేవని నిరూపిస్తున్నారు ఈతరం ప్రేమికులు. దేశం ప్రాంతంతో సంబంధం లేకుండా యువతీ యువకులు ప్రేమలో పడుతున్నారు. పెద్దల అంగీకారంతో ఒక్కటవుతున్నారు. తాజాగా నెదర్లాండ్స్ అమ్మాయి, యూపీ అబ్బాయి మధ్య ఏర్పడిన ప్రేమ పెద్దల అంగీకారంతో పెళ్లిపీటలెక్కింది. ఈ పెళ్లి వేడుకలో బంధుమిత్రులే కాకుండా రాజకీయ ప్రముఖులు కూడా అతిథులుగా హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు.
ప్రేమకు కళ్లే కాదు… హద్దులు కూడా లేవని నిరూపిస్తున్నారు ఈతరం ప్రేమికులు. దేశం ప్రాంతంతో సంబంధం లేకుండా యువతీ యువకులు ప్రేమలో పడుతున్నారు. పెద్దల అంగీకారంతో ఒక్కటవుతున్నారు. తాజాగా నెదర్లాండ్స్ అమ్మాయి, యూపీ అబ్బాయి మధ్య ఏర్పడిన ప్రేమ పెద్దల అంగీకారంతో పెళ్లిపీటలెక్కింది. ఈ పెళ్లి వేడుకలో బంధుమిత్రులే కాకుండా రాజకీయ ప్రముఖులు కూడా అతిథులుగా హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. ఉత్తరప్రదేశ్ ఫతేపూర్‌కి చెందిన హార్దిక్ వర్మ, ఇటీవల ఉద్యోగ రీత్యా నెదర్లాండ్స్ వెళ్లాడు. అక్కడ ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీలో సూపర్‌వైజర్‌గా ఉద్యోగం సంపాదించాడు. ఈ క్రమంలోనే తన సహోద్యోగి గాబ్రిలాతో ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. ఇద్దరు వివాహంతో ఒక్కటవ్వాలనుకున్నారు. అంతే గాబ్రిలాను వెంటపెట్టుకొని ఇండియాకు వచ్చిన హార్దిక్ తన కుటుంబ సభ్యుల ముందు నిల్చున్నాడు. విషయం అర్ధమైన కుటుంబ సభ్యులు వారి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతేకాదు, నవంబరు 29న హిందూ సంప్రదాయం ప్రకారం ఇద్దరికీ వైభవంగా వివాహం జరిపించారు. ఈ సందర్భంగా హార్దిక్ తమ కుటుంబీకులంతా గుజరాత్‌లో ఉంటారని, తమ పూర్వీకుల ఇల్లు ఉత్తరప్రదేశ్‌లో ఉండటంతో ఇక్కడికి వచ్చి వివాహం చేసుకున్నట్టు హార్దిక్ తెలిపాడు. డిసెంబర్ 25న తిరిగి గాబ్రిలాతో కలిసి నెదర్లాండ్స్‌కు వెళ్తానని, అక్కడ క్రిష్టియన్ సంప్రదాయంలో మళ్ళీ వివాహం చేసుకుంటామని పేర్కొన్నాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.