పేలిన వంట గ్యాస్ సిలిండర్.. నలుగురు చిన్నారులు సజీవ దహానం..
మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా వెంటనే అందజేయనున్నట్లు డిఎం తెలిపారు. ఇళ్ళు దెబ్బతిన్న ప్రజలకు జిల్లా యంత్రాంగం ద్వారా రేషన్ అందించారు. ఆర్థిక సహాయం కూడా అందించారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని ఆయన తెలిపారు.

బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. రామాపూర్ గ్రామంలో వంట గ్యాస్ సిలిండర్ పేలి మంటలు చేలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంలో నలుగురు చిన్నారులు సజీవదహనం అయ్యారు. మృతులను విపుల్ కుమార్ (5), కుమారి (8), హన్షికా కుమారి (3), శ్రుష్టి కుమారి (4)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేసినట్లు తెలుస్తోంది. చిన్నారుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా వెంటనే అందజేయనున్నట్లు డిఎం తెలిపారు. ఇళ్ళు దెబ్బతిన్న ప్రజలకు జిల్లా యంత్రాంగం ద్వారా రేషన్ అందించారు. ఆర్థిక సహాయం కూడా అందించారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని ఆయన తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..