Viral Video: ప్రిన్సిపాల్ రూమ్ నిండా పేడపూసిన విద్యార్థులు..ఇక ఏసీ అవసరం లేదంటూ సెటైర్..
ఏసీలకు బదులు చల్లదనం కోసం ఇలా గోడలకు ఆవు పేడ పూస్తే సరిపోతుందని, రిసెర్చ్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ పని చేసినట్లు ఆమె చెప్పారు. టీచర్స్ వాట్సాప్ గ్రూప్‌లో ప్రిన్సిపాల్ షేర్ చేసిన ఈ వీడియో వైరల్‌గా మారడంతో సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి. విద్యార్థుల సమ్మతి లేకుండానే తరగతి గదులకు పేడ పూయడం ఏంటని విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలు మండిపడ్డారు.

క్లాస్ రూమ్ చల్లగా ఉండాలన్న ఉద్దేశంతో ఢిల్లీలోని లక్ష్మీబాయి కాలేజీ ప్రిన్సిపాల్ ప్రత్యూష వత్సల తరగతి గదులకు ఆవుపేడ పూసిన ఘటన ఇంటర్‌నెట్‌లో సంచలనం రేపింది. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఢిల్లీ విద్యార్థి సంఘం స్పందించింది. ప్రిన్సిపల్ మేడమ్ చేసిన పనికి విద్యార్థి సంఘం నేతలు బదులు ఇచ్చారు. DUSU అధ్యక్షుడు రోనక్ ఖత్రి స్వయంగా ప్రిన్సిపాల్ రూమ్‌లో కూడా గోడలకు పూర్తిగా పేడ పూశారు.
వీడియో ఇక్కడ చూడండి..
TIT FOR TAT with Cowdung
Days after principal of Delhi University’s Lakshmibai College was seen applying #cowdung on walls to keep classroom cool#DUSU President @ronak_khatrii today smeared GOBOR on walls of her office in protest#Delhi #LaxmibaiCollege #dolar… pic.twitter.com/plBti694vX
— Mohammed Faizan Shaikh (@king7851007) April 16, 2025
అంతటితో ఆగలేదు.. మీ గదికి పేడ పూశాం.. ఇక ఏసీ ఎందుకు మేడమ్? అని ప్రశ్నించారు. ప్రిన్సిపాల్ మేడమ్ తన గదిలోని ఏసీని తొలగించి విద్యార్థులకు అందజేస్తారని తామంతా భావిస్తున్నామంటూ విద్యార్థి సంఘం నాయకుడు పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది.
వీడియో ఇక్కడ చూడండి..
#Delhi : Pratyusha Vatsala, principal of Lakshmibai College in DU, applied cow shit on the walls of classrooms in block C of the building claiming to combat the heat.
Heading back to stone age? pic.twitter.com/9PTu4u7Ne6
— Saba Khan (@ItsKhan_Saba) April 14, 2025
ఏప్రిల్ 13న లక్ష్మీబాయి కాలేజీ ప్రిన్సిపాల్ ప్రత్యూష వత్సల.. కాలేజ్ సీ బ్లాక్‌లోని క్లాస్ రూమ్ గోడలకు ఆవు పేడ పూశారు. ఏసీలకు బదులు చల్లదనం కోసం ఇలా గోడలకు ఆవు పేడ పూస్తే సరిపోతుందని, రిసెర్చ్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ పని చేసినట్లు ఆమె చెప్పారు. టీచర్స్ వాట్సాప్ గ్రూప్‌లో ప్రిన్సిపాల్ షేర్ చేసిన ఈ వీడియో వైరల్‌గా మారడంతో సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి. విద్యార్థుల సమ్మతి లేకుండానే తరగతి గదులకు పేడ పూయడం ఏంటని విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలు మండిపడ్డారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..