AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైలు ప్రయాణీకులకు అదిరిపోయే న్యూస్.. ఇకపై రైళ్లలోనే డబ్బులు డ్రా.. ఎలాగంటే..

ట్రైన్‌లో మినీ ప్యాంట్రీ స్థలాన్ని ATM ఇన్‌స్టాలేషన్ ప్రాంతంగా మార్చింది మెకానికల్ బృందం. కేటాయించిన స్థలంలో రెండు అగ్నిమాపక యంత్రాలను కూడా అందుబాటులో ఉంచినట్టుగా రైల్వేశాఖ వెల్లడించింది. దేశంలో మొట్టమొదటి ATMను ఏప్రిల్ 15 మంగళవారం ఆ ఎక్స్‌ప్రెస్‌లోని AC కోచ్‌లో టెస్ట్‌ ట్రయల్‌ నిర్వహించగా, ఇది విజయవంతమైందని రైల్వే అధికారులు స్పష్టం చేశారు.

రైలు ప్రయాణీకులకు అదిరిపోయే న్యూస్.. ఇకపై రైళ్లలోనే డబ్బులు డ్రా.. ఎలాగంటే..
Train Atm
Jyothi Gadda
|

Updated on: Apr 17, 2025 | 6:24 PM

Share

కదులుతున్న రైల్లో కూడా ATM ఎలా ఉంటుంది..? ప్రయాణీకులకు ప్రయోజనకరంగానే ఉంటుంది కదా..? ప్రయాణంలో ఉన్న ప్రజలకు నగదు అవసరమైనప్పుడు టెన్షన్‌ పడాల్సిన అవసరం ఉండదు. మీ దగ్గర ATM కార్డ్ ఉండి, మీ ఖాతాలో డబ్బు ఉంటే చాలు..కదులుతున్న రైల్లో కూడా నగదు విత్‌ డ్రా చేసుకోవచ్చు. అవును.. ఇదంతా నిజమే.. రైలు లోపల ఏర్పాటు చేసిన ATM వీడియో ఒకటి ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. మంత్రి అశ్విని వైష్ణవ్ తన X టైమ్‌లైన్‌లో రైలులో ATM వీడియోను షేర్‌ చేశారు. ఇది చూసిన నెటిజన్లు భిన్నమైన అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

భారతీయ రైల్వేలు తొలిసారిగా మహారాష్ట్రలోని మన్మాడ్-CSMT పంచవతి ఎక్స్‌ప్రెస్‌లో ట్రయల్ ప్రాతిపదికన ATMను ఏర్పాటు చేశాయి. 2025 ఏప్రిల్ 10న 12110 మన్మాడ్-CSMT పంచవతి ఎక్స్‌ప్రెస్‌లో మినీ ATM ట్రయల్ రన్ నిర్వహించారు. ట్రైన్‌లో మినీ ప్యాంట్రీ స్థలాన్ని ATM ఇన్‌స్టాలేషన్ ప్రాంతంగా మార్చింది మెకానికల్ బృందం. కేటాయించిన స్థలంలో రెండు అగ్నిమాపక యంత్రాలను కూడా అందుబాటులో ఉంచినట్టుగా రైల్వేశాఖ వెల్లడించింది. దేశంలో మొట్టమొదటి ATMను ఏప్రిల్ 15 మంగళవారం పంచవటి ఎక్స్‌ప్రెస్‌లోని AC కోచ్‌లో టెస్ట్‌ ట్రయల్‌ నిర్వహించగా, ఇది విజయవంతమైందని రైల్వే అధికారులు స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

ఈ రైలు మన్మాడ్, నాసిక్, ముంబై మధ్య ప్రతి రోజూ నడుస్తుంది. ఇగత్‌పురి, కసారా​మధ్య ఉన్న నో-నెట్‌వర్క్ సెక్షన్ గుండా రైలు ప్రయాణిస్తున్నప్పుడు యంత్రం సిగ్నల్ కోల్పోయిన కొన్ని సందర్భాలు మినహా టెస్ట్‌ సంపూర్ణంగా జరిగిందని భారత రైల్వే అధికారులు తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..