- Telugu News Photo Gallery Coconut oil and hibiscus flower for white hair turn into black in telugu lifestyle news
మందారంలో ఇది కలిపి రాస్తే.. ఒత్తైన పట్టులాంటి జుట్టు మీ సొంతం..!
ఒత్తైన, పట్టులాంటి జుట్టు కావాలని ప్రతి అమ్మాయి ఆశపడుతుంది. కానీ, నేటి ఆధునిక జీవశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది చిన్న వయసులోనే అనేక జుట్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కొందరు తీవ్రమైన జుట్టు రాలిపోయే సమస్యను ఎదుర్కొంటున్నారు. మరికొందరు చిన్న వయసులోనే తెల్లజుట్టు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అయితే, జుట్టు సమస్య ఏదైనా సరే.. కొబ్బరి నూనెలో ఈ ఒక్క పూవ్వును కలిసి వాడితే బెస్ట్ రిజల్ట్ ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ పువ్వును మెత్తగా చేసి కొబ్బరి నూనెలో కలిపి రాసుకుంటే కేవలం ఒక వారంలోనే తెల్ల జుట్టు నల్లగా మారుతుందని చెబుతున్నారు. నెరిసిన జుట్టు క్రమంగా నల్లగా మారుతుందని చెబుతున్నారు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Apr 16, 2025 | 3:06 PM

చిన్న వయసులోనే నెరిసిపోయిన జుట్టు సమస్యలకు మందార పువ్వు అద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. మందార పువ్వులలో ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇవన్నీ జుట్టు పెరుగుదలను పెంచుతుంది. మందారలో విటమిన్ సి, అమైనో ఆమ్లాలు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.

మందార జుట్టు కుదుళ్లను బలపరిచి, జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ఇది జుట్టును దృఢంగా, ఆరోగ్యంగా చేస్తుంది. తలలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. జుట్టును లోపలి నుండి పోషిస్తుంది. మందారలో యాంటీమైక్రోబయల్ గుణాలు ఉంటాయి.

మందారలోని గుణాలు చుండ్రును నివారించడంలో సహాయపడతాయి. ఇది తలలోని చర్మాన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. మందార పువ్వులు, ఆకులను మెత్తగా పేస్ట్ చేసి, పెరుగు లేదా కొబ్బరి నూనెతో కలిపి హెయిర్ మాస్క్‌గా ఉపయోగించవచ్చు.

ఇందుకోసం మందార పువ్వులను బాగా గ్రైండ్ చేసి, ఆ పేస్ట్ ను కొబ్బరి నూనెతో కలిపి, మీ జుట్టుకు అప్లై చేయండి. దీన్ని జుట్టు మూలాల నుండి చివర్ల వరకు బాగా అప్లై చేసి 10 నిమిషాలు మసాజ్ చేయండి. రాత్రంతా అలాగే వదిలేసి ఉదయం తలస్నానం చేయండి. వారంలో రెండు సార్లు ఈ ప్యాక్ వాడుతూ ఉంటే త్వరలోనే మీరు కోరుకున్న మార్పును చూస్తారని నిపుణులు చెబుతున్నారు. మందార జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తుంది. ఇది జుట్టుకు సహజమైన కండీషనర్ గా పనిచేస్తుంది.

మరో పద్ధతిలో కూడా మందారను ఉపయోగించవచ్చు. ఇందకోసం మందారాన్ని బాగా రుబ్బి, రసం తీయండి. దీన్ని పెరుగుతో కలిపి, దానికి కాఫీ పొడి వేసి 10 నిమిషాలు పక్కన పెట్టండి. తర్వాత దాన్ని మీ జుట్టుకు అప్లై చేసి 45 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత స్నానం చేయండి. ఇలా చేయడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. మందార పువ్వులు, ఆకులను నీటిలో మరిగించి, ఆ నీటిని జుట్టును కడగడానికి ఉపయోగించవచ్చు.

మందార జుట్టుకు సహజమైన రంగును అందిస్తుంది, తెల్ల జుట్టును నివారించడంలో సహాయపడుతుంది. తల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే, మందార పువ్వులను మరిగించి టీ కూడా తయారు చేసి తాగవచ్చు. మీరు ఉదయం ఖాళీ కడుపుతో మందార పూల టీ తాగటం వల్ల కూడా జుట్టుకు మంచి పోషణనిస్తుంది. మందార పువ్వులు, ఆకులను కొబ్బరి నూనెలో వేసి వేడి చేసి, ఆ నూనెను జుట్టుకు పట్టించవచ్చు.





























