Walking after Dinner: రాత్రి భోజనం తర్వాత 10 నిమిషాలు వాకింగ్ చేయండి చాలు.. ఎన్ని లాభాలో తెలిస్తే..
భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం సరైన పద్ధతి కాదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. తిన్న వెంటనే నిద్రపోవటం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. రాత్రిపూట తిన్న తరువాత కనీసం 10 నిమిషాల పాటు వాకింగ్ చేయడం చాలా ముఖ్యం అని అంటున్నారు. లేదంటే, కనీసం నిటారుగా కూర్చోవాలని చెబుతున్నారు. కానీ, పొరపాటున కూడా తిన్న వెంటనే పడుకోవడం చేయరాదని అంటున్నారు. భోజనం తర్వాత కనీసం 100 అడుగుల కంటే ఎక్కువ నడవటం వల్ల ఆరోగ్యానికి అనేక లాభాలు ఉన్నాయని చెబుతున్నారు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Apr 16, 2025 | 4:38 PM

డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడంలో నడవడం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ఇటీవల ప్రచురించబడిన ఒక అధ్యయనం వెల్లడించింది. ఈ అధ్యయనం బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్‌లో ప్రచురితమైంది. ఈ అధ్యయనం 5 లక్షలకు పైగా మధుమేహ వ్యాధిగ్రస్తులపై పరిశోధన చేశారు. తద్వారా సేకరించిన డేటాను విశ్లేషించినప్పుడు.. టైప్ 2 డయాబెటిస్‌ను తగ్గించడానికి నడక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నట్లు గుర్తించారు.

అయితే నడక సమయం మాత్రమే కాదు, నడక వేగం కూడా ముఖ్యమేనట. నెమ్మదిగా నడవడం కంటే వేగంగా నడవడం చాలా రెట్లు ఎక్కువ ప్రయోజనకరం. నెమ్మదిగా నడవడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని వ్యాయామ నిపుణులు కూడా అంటున్నారు. క్రమంగా వేగాన్ని పెంచడం, వేగంగా నడిచే అలవాటును పెంపొందించుకోవడం ద్వారా మాత్రమే డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

ప్రతిరోజూ భోజనం చేసిన తర్వాత వాకింగ్ చేస్తే గుండెకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీంతో హృదయ సంబంధ సమస్యలు రాకుండా ఉంటాయి. భోజనం తర్వాత వాకింగ్ చేస్తే ఒత్తిడి తగ్గిపోయి మనసు ప్రశాంతంగా మారుతుంది. ఉల్లాసంగా ఉంటారు. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.

తిన్న తర్వాత వాకింగ్ చేస్తే రక్తంలోని కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. దీంతో రక్తపోటు అదుపులో ఉంటుంది. బీపీ సమస్యతో బాధపడేవారు భోజనం తర్వాత వాకింగ్ చేయడం మంచిది. భోజనం తర్వాత వాకింగ్ చేస్తే మెదడుకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీంతో జ్ఞాపకశక్తి బాగుంటుంది. ఏకాగ్రత పెంచుకోవచ్చు.

రాత్రి భోజనం తర్వాత కాసేపు వాకింగ్ చేయడం వల్ల బాడీ, మనసు ప్రశాంతంగా మారతాయి. ఒత్తిడి తగ్గి మంచి నిద్ర పడుతుంది. నిద్రలేమితో బాధపడేవారు వాకింగ్ అలవాటు చేసుకోవడం మంచిది. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు కచ్చితంగా అన్నం తిన్నాక వాకింగ్ చేయడం అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు.





























