- Telugu News Photo Gallery Business photos Indian Railways Tatkal Ticket Booking Timings, IRCTC Tatkal Charges and Cancellation fee
Indian Railways: తత్కాల్ టికెట్ల సమయ వేళలు ఏంటి? రద్దు ఛార్జీల వివరాలు!
Indian Railways: దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థలో భారత రైల్వే మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉంది. అయితే ప్రతి రోజు లక్షలాది మంది ప్రయాణికులు రైలు ప్రయాణం చేస్తుంటారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా రైల్వే ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతూనే ఉంటుంది..
Updated on: Apr 16, 2025 | 5:10 PM

Indian Railways: ఇటీవల తత్కాల్ టికెట్ల విధానంలో నిబంధనలు, సమయ వేళలు మారినట్లు సోషల్ మీడియాలో పలు కథనాలు వచ్చాయి. అయితే దీనిపై రైల్వే స్పందించింది. ఎలాంటి నిబంధనలు, సమయ వేళలు మార్చలేదని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపింది. మరి ప్రస్తుతం తత్కాల్ టికెట్ల బుకింగ్ సమయ వేళలు, ఛార్జీల వివరాలు తెలుసుకుందాం.

తత్కాల్ ఇ-టికెట్ ప్రస్తుత సమయాలు ఏమిటి?: ప్రయాణీకులు ప్రయాణ తేదీకి ఒక రోజు ముందు బయలుదేరే స్టేషన్ నుండి ప్రయాణ రోజు మినహా, ఎంపిక చేసిన రైళ్లకు తత్కాల్ ఇ-టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. AC తరగతులకు (2A, 3A, CC, EC, 3E) IST ఉదయం 10:00 గంటలకు, నాన్-AC తరగతులకు (SL, FC, 2S) IST ఉదయం 11:00 గంటలకు బుకింగ్ ప్రారంభమవుతుంది. ఫస్ట్ AC మినహా అన్ని తరగతులకు తత్కాల్ సౌకర్యం అందుబాటులో ఉంది.


IRCTC తత్కాల్ ఛార్జీలు: సాధారణ టికెట్ ఛార్జీకి అదనంగా తత్కాల్ ఛార్జీలు జోడిస్తారు. రెండవ తరగతికి ప్రాథమిక ఛార్జీలో 10 శాతం ఛార్జీ ఉండగా, మిగతా అన్ని తరగతులకు ఇది 30 శాతం. అయితే ఈ ఛార్జీలు కనీస, గరిష్ట పరిమితులకు లోబడి ఉంటాయి. అయితే మీరు వెళ్లే దూరాన్ని బట్టి తత్కాల్ టికెట్లపై ఛార్జీలు ఉంటాయని గుర్తించుకోండి.


తత్కాల్ బుకింగ్‌ల కోసం ఏ ప్లాట్‌ఫామ్ ఉపయోగించాలి?: ప్రయాణీకులు అన్ని ప్రయాణ, టికెటింగ్ వివరాల కోసం IRCTC వెబ్‌సైట్ లేదా యాప్ వంటి అధికారిక వెబ్‌సైట్లను ఉపయోగించవచ్చు. తత్కాల్ పథకం ఫస్ట్ AC మినహా అన్ని తరగతులకు అందుబాటులో ఉంది.




