30 ఏళ్ల వయసులో మూడో పెళ్లి.. వరుడి వయసెంతో తెలుసా ??
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమ్రోహా జిల్లాలో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ముగ్గురు పిల్లల తల్లి అయిన 30 ఏళ్ల మహిళ, హిందూ మతాన్ని స్వీకరించి, 12వ తరగతి చదువుతున్న అబ్బాయిని ఆలయంలో వివాహం చేసుకుంది. తనకంటే 12 ఏళ్లు చిన్నవాడైన కుర్రాడితో మహిళ సంబంధం పెట్టుకోవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… షబ్నమ్ అనే మహిళ హిందూ మతం స్వీకరించి తన పేరు శివాని అని మార్చుకుంది. ఆమెకు తల్లిదండ్రులు లేరు. ఇదివరకే రెండుసార్లు వివాహం జరిగింది. ప్రస్తుతం ఈ వివాహం జరిగిన పరిస్థితులపై సమీక్ష చేస్తున్నారు. అయితే, ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ఫిర్యాదులు అందలేదని సమాచారం. శివాని తొలుత మీరట్‌లో ఒక వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆ తర్వాత వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. అనంతరం, సైదాన్వాలి గ్రామానికి చెందిన తౌఫీక్‌ను వివాహం చేసుకుంది. 2011లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తౌఫీక్ వికలాంగుడు అయ్యాడు. కొంతకాలంగా శివానికి 12వ తరగతి చదువుతున్న 18 ఏళ్ల కుర్రాడితో సంబంధం ఏర్పడింది. ఏప్రిల్ 4న షబ్నమ్… తౌఫీక్ నుంచి విడాకులు పొందింది. ఆ తరువాత ఆమె హిందూ మతాన్ని స్వీకరించి శివానిగా పేరు మార్చుకుంది అని తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విక్రమ్ కొడుకుకు అనుపమ లిప్ కిస్! లీకైన ఫోటోతో.. క్రేజీ టాక్
Prabhas: ఆ రోజు నాకు ఫస్ట్ టైమ్ కళ్ళల్లో నీళ్ళొచ్చాయి.. ప్రభాస్ ఎమోషనల్ వీడియో
మూడేళ్లుగా ప్రతి రోజూ నెలసరి.. కారణం తెలిసి ఖంగుతిన్న వైద్యులు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

