మూడేళ్లుగా ప్రతి రోజూ నెలసరి.. కారణం తెలిసి ఖంగుతిన్న వైద్యులు
నెలసరి సమయంలో మహిళలు శారీరకంగా, మానసికంగా అసౌకర్యానికి గురవుతుంటారు. రక్తస్రావం కారణంగా అనారోగ్య సమస్యలూ చుట్టుముడతాయి. నెలనెలా మూడు నుంచి వారం రోజుల పాటు ఇబ్బంది పడుతుంటారు. అయితే, అమెరికాకు చెందిన ఓ మహిళ మాత్రం మూడేళ్లుగా రోజూ పీరియడ్స్ తో ఇబ్బంది పడుతోంది.
ప్రతీ రోజూ రక్తస్రావం జరుగుతోందని, ఎంతమంది వైద్యులను కలిసినా ఉపయోగం లేకుండా పోయిందని వాపోయింది.ఈ వింత పరిస్థితిని ఆమె టిక్ టాక్ వీడియో ద్వారా సోషల్ మీడియాలో పంచుకుంది. రోజూ రక్తస్రావం జరుగుతుండడంతో తరచూ తలనొప్పి, తిమ్మిర్లు, కండరాల నొప్పులతో ఇబ్బందిపడుతున్నట్లు చెప్పింది. అమెరికాకు చెందిన పాపీ అనే మహిళ ఈ సమస్యను ఎదుర్కొంటోంది. ఈ విషయంలో ఎంతమంది వైద్యులను కలిసినా, ఎన్ని చికిత్సలు తీసుకున్నా పీరియడ్స్ మాత్రం ఆగలేదని తెలిపారు. దాదాపు 950 రోజుల తర్వాత తన సమస్యకు అసలు కారణం తెలిసిందని పాపీ వెల్లడించింది. వైద్య పరిభాషలో ‘బైకార్నుయేట్ యుటెరస్’ కారణంగా తనకు పీరియడ్స్ ఆగడంలేదని, ఈ పరిస్థితి అత్యంత అరుదైనదని వైద్యులు చెప్పారని వివరించింది. కేవలం 5 శాతం మంది మహిళలు మాత్రమే ఈ పరిస్థితిని ఎదుర్కొంటారని, ఆ ఐదు శాతం మంది మహిళల్లోనూ చాలామందిలో బైకార్నుయేట్ యుటెరస్ లక్షణాలు కనిపించవని చెప్పారన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రైల్లో ప్రయాణికుల నుంచి ఫోన్ కొట్టేయాలనుకున్నాడు.. చివరికి ఇలా..
బురదలో సేదతీరుతున్న దున్నపోతు.. వీపుపై తట్టిలేపిన సింహం
ఇకపై మీ ఇంటికే పెట్రోల్.. బంకుల దగ్గర క్యూ అక్కర్లేదు..
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

