రైల్లో ప్రయాణికుల నుంచి ఫోన్ కొట్టేయాలనుకున్నాడు.. చివరికి ఇలా..
రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే చేతిలో ఫోన్ క్షణాల్లో మాయమైపోవచ్చు. కొందరు కిటికీ దగ్గర కూర్చునే ప్రయాణికులు ఛార్జింగ్ పెట్టి సీటులో పెట్టి మాటల్లో పడిపోతారు. అదే అదనుగా దొంగలు రెచ్చిపోతారు. తాజాగా అలాంటి ఘటనే బీహార్‌లో జరిగింది. ఓ దొంగ కదులుతున్న రైల్లోనుంచి ఫోన్ చోరీ చేయాలనుకుని అడ్డంగా బుక్కయిపోయాడు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ చోట రైలు కొద్ది క్షణాలు ఆగింది. అందులో ఓ బోగీలోని ప్రయాణికుడు విండో పక్కగా కూర్చుని ఫోన్ మాట్లాడుతున్నాడు. అది గమనించిన ఓ దొంగ అతని ఫోన్ కొట్టేయాలనుకున్నాడు. వెంటనే రంగంలోకి దిగి అతని చేతిలో ఉన్న ఫోన్ లాక్కున్నాడు. అలర్టయిన ఆ ప్రయాణికుడు ఆ దొంగ చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఇంతలో రైలు కదిలిపోయింది. అయినా ఆ ప్రయాణికుడు దొంగను వదల్లేదు. రైలు ముందుకు దూసుకెళ్తోంది.. దొంగ రైలుకి వేళాడుతూనే ఉన్నాడు. దొంగను పట్టుకున్న ప్రయాణికుడు అతన్ని తలపై కొడుతూనే ఉన్నాడు. ఓ వైపు వదిలించుకుని పారిపోదామా అంటే రైలు వేగంగా దూసుకెళ్తోంది. కిందపడితే ప్రాణాలు పోతాయి.. దానికన్నా వీడిచేతిలో దెబ్బలుతిని ప్రాణాలు కాపాడుకోవడం బెటరనుకొని అలాగే ఉండిపోయాడు దొంగ. అలా దొంగకి చుక్కలు చూపించాడు ప్రయాణికుడు. ఇంతలో రైలు స్లో అవడంతో.. కొంతమంది యువకులు వచ్చి ఆ దొంగను కాపాడే ప్రయత్నం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఫోన్ కోసం ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడని వాపోయారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బురదలో సేదతీరుతున్న దున్నపోతు.. వీపుపై తట్టిలేపిన సింహం
ఇకపై మీ ఇంటికే పెట్రోల్.. బంకుల దగ్గర క్యూ అక్కర్లేదు..
ఆర్ఆర్ఆర్ సెంటిమెంట్.. ఎస్ఎస్ఎంబీ 29 రిలీజ్ అప్పుడే..!
kalyan Ram: తమ్ముడు బక్కచిక్కిపోతే.. అన్నకు ప్రశ్నేంటి?
అమానవీయం.. పీరియడ్స్‌లో ఉన్న విద్యార్థినికి క్లాస్ రూమ్ బయట పరీక్ష!
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

