ఆర్ఆర్ఆర్ సెంటిమెంట్.. ఎస్ఎస్ఎంబీ 29 రిలీజ్ అప్పుడే..!
మహేష్ బాబు హీరోగా రాజమౌళి డైరెక్షన్ లో ఓ అడ్వెంచరస్ మూవీ తెరకెక్కుతోంది. అనౌన్స్‌మెంట్ నుంచే ఈ క్రేజీ కాంబోపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎస్ఎస్ఎంబీ 29 వర్కింగ్ టైటిల్‌తో పకడ్బందీగా ఈ షూట్ జరుగుతోంది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
2027 మార్చి 25న వరల్డ్‌వైడ్‌గా SSMB చిత్రాన్ని విడుదల చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ తేదీకి ఓ ప్రత్యేకత ఉంది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా వచ్చిన RRR మూవీ మార్చి 25నే రిలీజ్ అయింది. ఆ మూవీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడంతో పాటు ఆస్కార్ అవార్డు సైతం దక్కించుకుంది. అందుకే ఈ డేట్ బాగా కలిసొస్తుందని భావిస్తున్న జక్కన్న అదే సెంటిమెంటుతో మహేశ్ చిత్రాన్ని కూడా మార్చి 25న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతోన్న SSMB 29 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తైనట్లు సమాచారం. ఇండియాతో పాటు సౌతాఫ్రికా, యూరోప్ లోనూ ఈ మూవీ షూటింగ్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాకు కీరవాణి సంగీతం సమకూర్చుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
kalyan Ram: తమ్ముడు బక్కచిక్కిపోతే.. అన్నకు ప్రశ్నేంటి?
అమానవీయం.. పీరియడ్స్‌లో ఉన్న విద్యార్థినికి క్లాస్ రూమ్ బయట పరీక్ష!
Samantha: ఫ్యాన్స్ ఎఫెక్ట్ సమంతకు కోట్లలో నష్టం

పామును బంధించేందుకు ప్రయత్నించిన స్నేక్ క్యాచర్‌కు ఝలక్..

వీర భక్తుడు అనుకునేరు.. అసలు విషయం వేరే..

ఊరందరికి స్నేహితుడిగా మారిన కొండముచ్చు.. వీడియో

జనావాసాల్లోకి సింహం.. కెన్యా పార్క్‌లో దారుణం.. వీడియో

గలీజుగా న్యూయార్క్ సబ్వే.? వీడియో

వాహనాలకు హారన్‌గా ఫ్లూట్, తబలా సంగీతం! వీడియో

ఆడ స్పైడర్‌ను ఆకర్షించేందుకు డ్యాన్స్పడిపోయిందా ఒకే..! లేదంటే
