అమానవీయం.. పీరియడ్స్‌లో ఉన్న విద్యార్థినికి క్లాస్ రూమ్ బయట పరీక్ష!
తమిళనాడులో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ బాలికకు నెలసరి రావడంతో ఆమెను క్లాస్ బయట కూర్చోబెట్టి పరీక్ష రాయించారు. నెలసరి శుభ్రతపై ఓవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాలసీలు రూపొందిస్తూ, అవగాహన కార్యక్రమాలు చేపడుతుంటే.. కొందరు మాత్రం కనీస విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారు. కోయంబత్తూరులో 8వ తరగతి చదువుతున్న విద్యార్థినికి ఏప్రిల్ 5న తొలిసారి రుతుక్రమం మొదలైంది.
అప్పటికి ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతుండటంతో.. ఆ విద్యార్థిని రెండు రోజుల తర్వాత ఏప్రిల్ 7న ఫైనల్ పరీక్ష రాసేందుకు ఆమె తన పాఠశాలకు వచ్చింది. అయితే, ఆ విద్యార్థినిని ఉపాధ్యాయులు లోపలికి అనుమతించలేదు. తరగతి గది బయటే కూర్చోబెట్టి పరీక్ష రాయించారు. ఇంటికి వెళ్లిన తర్వాత విషయం ఆ విద్యార్ధిని తన తల్లికి చెప్పింది. బాలిక తల్లి ఏప్రిల్ 9న స్కూల్‌కు వచ్చింది. అప్పుడు కూడా ఆ విద్యార్థిని తరగతి బయటే కూర్చొని పరీక్ష రాస్తూ కన్పించింది. బాలిక తల్లి ఈ ఘటనను వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. క్షణాల్లో ఆ వీడియో వైరల్‌గా మారడంతో ఆ పాఠశాల యాజమాన్యంపై పెద్దఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈ ఘటనపై బాలిక తల్లి విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. బాలిక తల్లి ఫిర్యాదుతో ఘటనపై విచారణ చేపట్టారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Samantha: ఫ్యాన్స్ ఎఫెక్ట్ సమంతకు కోట్లలో నష్టం
ఇదేంది మావా.. ఈ రీజన్ తో కూడా భర్తను వదిలేస్తారా ??
ఇది సినిమాలా లేదు.. చిన్న పాటి బ్లూ ఫిల్మ్‌లా ఉంది..!
పవన్ ఇంటికి వెళ్లి.. చిన్ని మార్క్‌కు ధైర్యం చెప్పిన ఐకాన్ స్టార్
బయట రాష్ట్రాల్లో ఉండే వాళ్ళు ఏపీ గురించి సలహాలు.. ఇవ్వొద్దు
తెలుగునాడుగా మార్చండి.. గరికపాటి సంచలన వ్యాఖ్యలు
ఇదేంటి సామీ.. ఏకంగా పాముతో సమావేశానికి వచ్చావ్
బంపర్ ఆఫర్ కొట్టిన మెకానిక్..రాత్రికి రాత్రే కోటీశ్వరుడు !!
పరమభక్తుడు.. శఠగోపానికే శఠగోపం పెట్టాడుగా!
కాయ్ రాజా కాయ్.. ఎంత డబ్బు లెక్క పెడితే అంత సొమ్ము మీదే..
శ్మశానంలో మండుతున్న చితుల మధ్య "హోలీ' ఎక్కడంటే..

