పవన్ ఇంటికి వెళ్లి.. చిన్ని మార్క్‌కు ధైర్యం చెప్పిన ఐకాన్ స్టార్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను అల్లు అర్జున్ కలిశారు. ఇటీవల పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ తన స్కూల్లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయాల పాలయ్యాడు. ఈ విషయం తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్.. తన అన్న మెగాస్టార్ చిరు.. వదిన సురేఖ సమేతంగా.. సింగపూర్ బయలుదేరాడు. అప్పటికే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్ని మార్క్‌ను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని... తండ్రిగా ధైర్యం చెప్పారు.
ఆ వెంటనే.. మార్క్ శంకర్‌ను, తనతో పాటు హైద్రాబాద్‌కు తీసుకొచ్చారు పవన్. ఇక మార్క్ శంకర్ ను ఇంటికి తీసుకురావడంతో.. ఆయన సన్నిహితులు పవన్ చిన్న కొడుకును పరామర్శిస్తున్నారు. ఈక్రమంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా… నేరుగా పవన్‌ను ఇంటికి వెళ్లి కలిశారు. చిన్ని మార్క్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. ఆ చిన్నారితో మాట్లాడి.. ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. ఇక ప్రమాదం నుంచి తన కుమారుడు సురక్షితంగా బయటపడటంతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు పవన్ సతీమణి అన్నా. స్వామి వారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. అలాగే తలనీలాలు కూడా సమర్పించుకున్నారు. అన్నప్రసాదాలకు రూ. 17 లక్షలు విరాళంగా ఇచ్చారు అన్నా.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ వస్తువులను ముట్టుకున్నారా? వెంటనే చేతులు కడుక్కోండి.. లేదంటే..
చొక్కాలు విప్పి.. ‘ఎక్స్‌ప్రెస్ వే’ పై ఓవరాక్షన్
క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల నమ్మలేని ప్రయోజనాలివే
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

