దినసరి కూలీకి రూ.4 కోట్ల ఆదాయపు పన్ను
ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఒక దినసరి కూలీ.. అదికూడా నిరుపేద వృద్ధురాలికి ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. ఆమెకు రూ. 4 కోట్లకు పైగా ఆదాయం ఉందని, అందుకు సంబంధంచిన ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలని ఆ నోటీసులో పేర్కొంది. సబ్రా అనే ఈ వృద్ధురాలు జస్రన పట్టణంలోని మురికివాడలో తన భర్తతో కలిసి నివసిస్తోంది.
ఆ దంపతులిద్దరూ దినసరి కూలీలుగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ వృద్ధ దంపతులు 2020-21 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2021-22 ఏడాదికి రూ. 4.88 కోట్లకు పైగా ఉన్న ఆదాయం కలిగి ఉన్నారని, దీనిపై వారు పన్ను చెల్లించాలని ఆదాయపు పన్ను శాఖ అధికారులు మూడేళ్ల కిందట నోటీసులు జారీ చేశారు. సబ్రాకు చదువు రాకపోవడంతో ఆమె ఆ నోటీసులకు స్పందించలేదు. ఆమె పన్ను చెల్లించకపోవడంతో అధికారులు తాజాగా మరోసారి నోటీసులు పంపారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలని సూచించారు. పన్ను ఎందుకు చెల్లించలేదో వివరణ ఇవ్వాలని కూడా ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. పోస్టుమాన్ సాయంతో విషయం తెలుసుకున్న వృద్ధ దంపతులు కంగుతిన్నారు. ఆదాయపు పన్ను అంటే ఏమిటో కూడా తనకు తెలియదని వృద్ధురాలు వాపోయింది. ఈ ఘటనపై న్యాయవాది సంజయ్ జైన్ స్పందిస్తూ…ఇటీవలి కాలంలో నోటీసులు జారీ చేసే సమయంలో పొరపాట్లు జరుగుతున్నాయని అన్నారు. అందులో భాగంగానే వృద్ధురాలికి నోటీసులు వచ్చాయని తెలిపారు. పొరపాటు జరగని పక్షంలో ఆధార్ ఫోర్జరీకి సంబంధించిన అంశం కూడా అయి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పవన్ భార్యపై విమర్శలు.. రంగంలోకి దిగి సీరియస్ అయిన విజయశాంతి
బట్టలిప్పి నా ముందు నిలుచో.. హీరోయిన్‌కు సెట్లోనే స్టార్ హీరో వేధింపులు
30 ఏళ్ల వయసులో మూడో పెళ్లి.. వరుడి వయసెంతో తెలుసా ??
విక్రమ్ కొడుకుకు అనుపమ లిప్ కిస్! లీకైన ఫోటోతో.. క్రేజీ టాక్
Prabhas: ఆ రోజు నాకు ఫస్ట్ టైమ్ కళ్ళల్లో నీళ్ళొచ్చాయి.. ప్రభాస్ ఎమోషనల్ వీడియో
చిన్న పామే కదా అని ఆటలాడాడు.. చివరికి ఇలా..
కస్టమర్లా వచ్చాడు.. షాపులో ఒంటరిగా ఉన్న మహిళను అదను చూసి..
వీడు మామూలోడు కాదు.. పామునే ఫుట్ బాల్ ఆడుకున్నాడుగా!
స్వామీ.. మా అత్త చనిపోయేలా చూడు.. రూ.20 నోటుతో దేవుడికి 'సుపారీ'
అమెరికాలో గడ్డి కోస్తూ లక్షల్లో సంపాదన.. నెటిజన్ల రియాక్షన్ ఇదే!
నాలుగు షాపుల్లో చొరబడిన దొంగలు.. పాపం చివరికి దొరికింది ఇదే!
క్లాస్ 12 తర్వాత చదువు ఆపేయండి! సంచలనంగా వ్యాపారవేత్త కామెంట్

