బాబోయ్ బంగారం.. ఇక కొనలేమండోయ్..! ఈ ఏడాది చివరినాటికి లక్ష దాటి.. భారీగా పెరిగే ఛాన్స్..!!
బంగారం..బంగారమే...! ఎల్లో మెటల్‌ని మించిన ఖనిజం లేదు. ఇప్పుడు మీ చేతిలో డబ్బులు ఉంటే వెంటనే బంగారం దుకాణానికి వెళ్లి.. ఎంత బంగారం వస్తే అంత కొనేయండి. ఎందుకంటే రానున్న రోజుల్లో బంగారం ధర లక్ష దాటిపోతుంది. ఇది మేము చెబుతున్న విషయం కాదు. ప్రపంచ మార్కెట్ పరిస్థితులు చెబుతున్న విషయం. ఇక గోల్డ్‌మన్ శాక్స్ అనే రీసెర్చ్ కంపెనీ చెబుతున్న లెక్కలు చూస్తే, దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.

లకారానికి మూడంటే మూడు అడుగుల దూరంలో ఉంది బంగారం. అది గట్టిగా పరుగులు పెడితే… ఒక్క రోజులో లక్ష రూపాయలను దాటేసేలా ఉంది. గోల్డ్ రేట్లు తగ్గొచ్చని చెప్పిన అంచనాలను తల్లకిందులు చేసి మరీ… పదండి ముందుకు అంటోంది పసిడి. బంగారం ధరలపై గోల్డ్‌మన్ శాక్స్ ఇచ్చిన అంచనాలు చూస్తుంటే గుండె జారి గల్లంతవ్వాల్సిందే. ఇండియన్ మార్కెట్లోనే కాదు.. ఇంటర్నేషల్ మార్కెట్లో సైతం బంగారం హైరేట్ ర్యాలీ ఇంకా కంటిన్యూ అవుతుందని గోల్డ్‌మన్ శాక్స్ అనే రీసెర్చ్ కంపెనీ నివేదిక చెబుతోంది.
లక్ష కాదు.. లక్షా పాతిక… ఇది పక్కా అంటుంది గోల్డ్‌మన్ శాక్స్ అనే కంపెనీ రిపోర్ట్. ఈ ఏడాది చివరినాటికి పసిడి ధర రూ.1.25లక్షలు చేరే చాన్స్ ఉందని గోల్డ్‌మన్ శాక్స్ అనే కంపెనీ నిపుణులు చెబుతున్నారు. బంగారం ధరలపై ఈ ఏడాదిలో ఇప్పటిదాకా గోల్డ్‌మన్ శాక్స్ తమ అంచనాలను మూడుసార్లు సవరించింది. తొలుత ఔన్స్ 3వేల 300 డాలర్లుగా, ఆ తర్వాత 3వేల 700 డాలర్లుగా, ఇప్పుడు 4వేల 500 డాలర్లు అని చెబుతుంది. ఈ లెక్కన మనదేశంలో బంగారం ధర లక్షా 25వేల రూపాయలకు చేరవచ్చని చెబుతున్నారు.
అసలు గోల్డ్‌మన్ శాక్స్ అంటే ఏంటి? ఈ సంస్థ ఇచ్చిన, ఇస్తోన్న అంచనాలకు ఎందుకింత ప్రాధాన్యం..? అంటే ఆర్థిక సేవలు అందిస్తూ, ఫైనాన్షియల్ రీసెర్చ్‌లో సుదీర్ఘ అనుభవం ఉన్న సంస్థ ఇది. 1869లో న్యూయార్క్‌లో సేవలు ప్రారంభించిన గోల్డ్‌మన్ శాక్స్ ఇచ్చే నివేదికలకు, వేసే అంచనాలకు చాలా ప్రాధాన్యం ఉంది. 20 ఏళ్లలో బంగారంపై 9సార్లు గోల్డ్‌మన్ శాక్స్ నివేదికలు ఇచ్చింది. ఆ రిపోర్ట్స్ చెప్పినట్లు 8 సార్లు బంగారం ధరలు పెరిగాయి. మరి తొమ్మిదో నివేదిక ఊహించినట్లే గోల్డ్ పెరుగుతుందా..? అన్న ఉత్కంఠ నెలకొంది.
అసలు బంగారం ధరలు పెరగడానికి కారణం ట్రంప్ వేస్తున్న సుంకాలే. వేలంపాట రేటు పెరిగినట్లు సుంకాలు పెరుగుతున్నాయి. రెండు ప్రపంచయుద్ధాలను చూసిన ప్రపంచం- ఇలాంటి వాణిజ్యయుద్ధాన్ని మాత్రం చూడలేదు. ఇలాంటి సుంకాల మోతను చూడలేదు. వాణిజ్య యుద్ధం ముదిరితే బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోవచ్చన్న అభిప్రాయాలు ఎప్పట్నుంచో వినిపిస్తున్నాయి. గోల్డ్‌మన్ శాక్స్ కూడా ఇప్పుడిదే చెబుతుంది. ఇప్పటికే గోల్డ్ రేట్లు లక్షకు చేరువైన నేపథ్యంలో ఈ అంచనా అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి