దాల్చిన చెక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. అస్సలు వదులుకోరు..
దాల్చిన చెక్క .. మసాలా దినుసుల్లో ఇది కూడా ఒకటి..ప్రతి వంటింట్లోనూ తప్పక ఉంటుంది. వంటకాల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. ఇది ఆహారానికి ప్రత్యేక రుచిని అందిస్తుంది. దాల్చిన చెక్క శరీరానికి చాలా మేలు చేస్తుంది. దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉంటాయి. నోటి ఆరోగ్యం నుంచి గుండె ఆరోగ్యం వరకు దాల్చిన చెక్క వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Apr 15, 2025 | 9:24 PM

దాల్చిన చెక్కలో యాంటీ ఇన్‌ఫ్లేమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. దీని వలన ఇన్‌ఫ్లేమేషన్ తగ్గుతుంది. పాలీఫినాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు దాల్చిన చెక్కలో ఉంటాయి. దీని వలన వాపు వంటి సమస్యలు తగ్గుతాయి. ఇవి కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.

దాల్చిన చెక్కలో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. దీనిలో సిన్నమాల్డిహైడ్ నూనె బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లను దూరం చేయడం సహాయపడుతుంది. దాల్చిన చెక్కలో యాంటీ వైరల్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇన్‌ప్లుయోంజా, దోమల ద్వారా వచ్చే వైరల్ జ్వరాల నుంచి రక్తణలోదాల్చినచెక్క సహాయపడుతుంది.

దాల్చిన చెక్క గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సహాయపడుతుంది. క్రమం తప్పకుండా దాల్చినచెక్క తీసుకోవడం వల్ల ట్రై గ్లిజరాయిడ్స్ తగ్గుతాయి. దాల్చిన చెక్కలో ప్రీబయోటిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సహాయపడతాయి.

దాల్చిన చెక్కను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్ అవుతాయి. షుగర్ రోగులు దాల్చినచెక్క తీసుకుంటే మంచిది. రక్తపోటును కంట్రోల్ చేయడంలో దాల్చిన చెక్క సహాయపడుతుంది. దాల్చినచెక్కను తీసుకుంటే రక్తపోటు తగ్గుతుంది. హైబీపీతో బాధపడేవారు దాల్చినచెక్క తీసుకుంటే మంచిది.

దాల్చిన చెక్కను వివిధ రూపాల్లో తీసుకుంటే దీర్ఘకాలిక సమస్యలు తగ్గుతాయి. దంతాల నొప్పిని తగ్గించడంలో, నోటి బ్యాక్టీరియా పెరుగుదలను అదుపు చేయడంలో దాల్చినచెక్క సాయపడుతుంది. దాల్చిన చెక్క తీసుకుంటే దుర్వాసన తగ్గుతుంది. దాల్చిన చెక్కను తింటే మలబద్దకం, అజీర్తి తగ్గుతాయి.





























