Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPI Payments: సర్వర్ డౌన్ ఉన్నా చెల్లింపులు ఈజీ.. యూపీఐలో ఆ ఫీచర్ గురించి తెలుసా?

భారతదేశంలో నగదు చెల్లింపుల్లో యూపీఐ సర్వీసులు డిజిటల్ విప్లవాన్ని తీసుకొచ్చాయి. ముఖ్యంగా దేశంలో చిల్లర సమస్యలకు యూపీఐ చెక్ పెట్టింది. అయితే గత రెండు వారాలుగా యూపీఐ సేవలు మూడుసార్లు అంతరాయాలను ఎదుర్కొన్నాయి. దీని వలన లక్షలాది మంది వినియోగదారులు అసౌకర్యానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో యూపీఐ సర్వర్ డౌన్ అయినా యూపీఐ యాప్స్‌లో ఉండే ఒక ఫీచర్‌తో చెల్లింపులు సింపుల్‌గా చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ ఫీచర్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

UPI Payments: సర్వర్ డౌన్ ఉన్నా చెల్లింపులు ఈజీ.. యూపీఐలో ఆ ఫీచర్ గురించి తెలుసా?
Upi
Follow us
Srinu

|

Updated on: Apr 16, 2025 | 5:00 PM

డిజిటల్ చెల్లింపులకు పెరుగుతున్న ప్రజాదరణతో యూపీఐ వినియోగదారుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. అందువల్ల తరచుగా సర్వర్ క్రాష్‌లకు కారణం అవుతుంది. ఎన్‌పీసీఐ తాజా డేటా ప్రకారం ప్రతి నిమిషానికి 400,000 కంటే ఎక్కువ యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయి. ఫలితంగా భారతదేశం అంతటా ప్రతి గంటకు దాదాపు 23 మిలియన్ల లావాదేవీలు జరుగుతాయి. యూపీఐ చెల్లింపులపై ప్రజలు భారీగా ఆధారపడడం వల్ల చాలా మంది తమ చేతుల్లో సొమ్ము ఉంచుకోవడం లేదంటే అతిశయోక్తి కాదు. గత శనివారం యూపీఐ సర్వర్ సమస్యల కారణంగా చాలా మంది వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లలో చాలామంది చెల్లింపులు చేయలేకపోయారు. నగదు లేని వారికి యూపీఐ సర్వర్లు పని చేయకపోయినా డిజిటల్ లావాదేవీలను నిర్వహించడానికి ఉన్న మార్గాల గురించి తెలుసుకుందాం. 

యూపీఐ లైట్ 

ఎన్‌పీసీఐ కొన్ని సంవత్సరాల క్రితం యూపీఐ లైట్ సర్వీస్‌ను ప్రవేశపెట్టింది. దీని వల్ల వినియోగదారులు ఆన్‌లైన్‌లో లేకుండానే చెల్లింపులు చేసుకునే అవకాశం లభించింది. నెట్‌వర్క్ కవరేజ్ లేదా కనెక్టివిటీ లేని ప్రాంతంలో ఉంటే ఈ ఫీచర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. యూపీఐ లైట్ డిజిటల్ వాలెట్ లాగా పనిచేస్తుంది. రోజువారీ రీఛార్జ్‌లను రూ.4,000 వరకు అనుమతిస్తుంది. అయితే వ్యక్తిగత లావాదేవీలు రూ.500కి పరిమితం చేశారు. ఈ సర్వీస్ గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్‌ల ద్వారా అందుబాటులో ఉంది. రిసీవర్‌కు సంబంధించిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా నెట్‌వర్క్ లేకుండా యూపీఐ చెల్లింపులు చేయవచ్చు. మీ ఇంటర్నెట్ డౌన్ అయినప్పటికీ లేదా సర్వర్ సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ, చెల్లింపులు సజావుగా సాగుతాయి. ముఖ్యంగా ఈ లావాదేవీల కోసం మీరు మీ యూపీఐ పిన్‌ను నమోదు చేయాల్సిన అవసరం లేదు.

ఎన్ఎఫ్‌సీ ద్వారా ఆఫ్‌లైన్ చెల్లింపులు  

మీ ఫోన్‌లోని ఎన్‌ఎఫ్‌సీ(నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్) టెక్నాలజీ ద్వారా ఆఫ్‌లైన్ చెల్లింపులను సులభతరం చేయడానికి మీరు గూగుల్ పేతో సహా వివిధ యాప్‌లకు మీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌ను కూడా జోడించవచ్చు. ఈ ఎంపికను ఉపయోగించడానికి రిసీవర్ ఎన్‌ఎఫ్‌సీకి మద్దతు ఇచ్చే పీఓఎస్ మెషీన్‌ను కలిగి ఉండాలి. ఇది ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండా సజావుగా డిజిటల్ చెల్లింపులను ఆస్వాదించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. పరికరం తిరిగి ఆన్‌లైన్‌లోకి వచ్చిన తర్వాత, చెల్లింపు పంపినవారి, రిసీవర్ ఖాతాల్లో ఆటోమెటిక్‌గా రికార్డ్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి