AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lottery Jackpot: ఇంటికి వెళ్లి చెత్త ,సేకరించే మహిళలు.. రూ. 250 అప్పు చేసి లాటరీ టికెట్ కొన్నారు.. రూ. 10 కోట్లు గెలుచుకున్నారు..

మలప్పురంలోని పరప్పనంగడి మున్సిపాలిటీలో హరిత కర్మ సేనకు చెందిన 11 మంది మహిళలు కలిసి లాటరీ టిక్కెట్‌ను కొనుగోలు చేశారు. వారం రోజుల క్రితం రూ.250 టిక్కెట్టు పెట్టి లాటరీ టికెట్ కొనేందుకు వెళ్లగా..వారి దగ్గర అంతమొత్తం లేదు. దీంతో ఆ మహిళలు తమ దగ్గర ఉన్న రూ.25లను పోగేశారు.

Lottery Jackpot: ఇంటికి వెళ్లి చెత్త ,సేకరించే మహిళలు.. రూ. 250 అప్పు చేసి లాటరీ టికెట్ కొన్నారు.. రూ. 10 కోట్లు గెలుచుకున్నారు..
Lottery Jackpot
Surya Kala
|

Updated on: Jul 28, 2023 | 12:06 PM

Share

అదృష్టం ఎప్పుడు ఎవరికి ఎలా కలిసి వస్తుందో ఎవరికి తెలియదు. ఇంకా చెప్పాలంటే దురదృష్టం తెరచే వరకూ తలపు తడితే.. అదృష్టం అలా వచ్చి ఇలా వెళ్తుందని అని పెద్దలు చెబుతారు. అలా అదృష్టం తలుపు తట్టి రాత్రికి రాత్రే కోటీశ్వరురాలయ్యారు కొందరు మహిళలు. నిరుపేద కుటుంబాలకు చెందిన కేరళకు చెందిన 11 మంది మహిళలకు కోటి రూపాయల లాటరీ తగిలింది. ఈ విషయం తెలియగానే మొదట ఆ మహిళలు ఆశ్చర్యపోయారు. చెత్త ఏరుకునే చేసే మహిళలు ఇప్పుడు కోటీశ్వరులయ్యారు. ఈ మహిళల సంపాదనతోనే కుటుంబం గడుస్తున్న నేపథ్యంలో ఈ మహిళలకు రూ.10 కోట్ల జాక్ పాట్ లభించింది. ఈ విషయం తెలియగానే తాము నమ్మలేకపోయామని మహిళలు చెబుతున్నారు.

మలప్పురంలోని పరప్పనంగడి మున్సిపాలిటీలో హరిత కర్మ సేనకు చెందిన 11 మంది మహిళలు కలిసి లాటరీ టిక్కెట్‌ను కొనుగోలు చేశారు. వారం రోజుల క్రితం రూ.250 టిక్కెట్టు పెట్టి లాటరీ టికెట్ కొనేందుకు వెళ్లగా..వారి దగ్గర అంతమొత్తం లేదు. దీంతో ఆ మహిళలు తమ దగ్గర ఉన్న రూ.25లను పోగేశారు. మొత్తం రూ.250 లు వసూలు చేసి టికెట్ ను కొనుగోలు చేశారు. వారం రోజుల తర్వాత ఆ టికెట్ కు సంబంధించిన లక్కీ డ్రాను తీసి.. విజేతను ప్రకటించారు. దీంతో ఆ మహిళలు ఆశ్చర్యపోయారు. ఇదే విషయంపై స్పందిస్తూ లక్కీ డ్రా కోసం తాము ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ఓ మహిళ తెలిపింది.

పక్కింటివారు గెలిచాడని తెలియగానే నిరుత్సాహపడిన మహిళ

ఇవి కూడా చదవండి

మొదట పాలక్కాడ్‌కు చెందిన వ్యక్తి విజేతగా నిలిచాడని తెలియగానే తాను నిరుత్సాహానికి గురయ్యానని ఆ బృందంలోని ఒక మహిళ చెప్పింది.  అయితే ఆ లాటరీ తగిలింది.. తాము తీసుకున్న టికెట్ కు అని తెలిసిన తర్వాత తమ ఆనందానికి హద్దే లేదని పేర్కొంది.  ఈ 11 మంది మహిళల బృందాన్ని రూ.10 కోట్ల లాటరీ విజేతలని కేరళ టిక్కెట్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. అయితే ఈ బృందంలోని రాధా అనే మహిళ తాను ఇంతకు ముందు కూడా లాటరీ టికెట్స్ కొనుగోలు చేసినట్లు.. కానీ ఇంత భారీ మొత్తం గెలుచుకోవడం ఫస్ట్ టైం అని చెప్పింది.

భారీ మొత్తంలో జాక్‌పాట్ వస్తుందని ఊహించలేదంటున్న మహిళలు 

టికెట్ కోసం రూ.250 అప్పు చేసి కొనుగోలు చేసిన ఈ మహిళలు.. జీవితంలో ఇంత భారీ మొత్తంలో డబ్బులు వస్తాయని తాము ఊహించలేదని చెప్పారు. హరిత్ కర్మ సేన ఇంటి నుండి, ఇతర ప్రాంతాల నుండి చెత్తను సేకరిస్తారు. నాన్ బయోడిగ్రేడబుల్ వ్యర్థాలను సేకరించి రీసైక్లింగ్ కోసం పంపుతారు. ఈ మహిళలు చాలా కష్టపడి పనిచేస్తారని ఈ సంస్థ ప్రెసిడెంట్ షీజ చెప్పారు. భాగ్య అనే మహిళ ఆమె కుటుంబంలో సంపాదించే ఏకైక వ్యక్తి. ఇంటి బాధ్యత ఆమెది. ఇప్పుడు లాటరీ డబ్బులతో కుటుంబ యజమాని చికిత్స, కుమార్తె వివాహం వంటి అనేక ముఖ్యమైన పనులు తమకు సులభంగా మారతాయని చెబుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..