Bamboo Crafts: సంక్షేమ పథకం అంటే ఇదేకదా.. మహిళల అదృష్టాన్ని మార్చేసి.. సంపాదన పరులను చేసిన ప్రభుత్వం..

ప్రభుత్వం ప్రవేశ పెట్టె పథకాలు.. బాధ్యత కలిగించేలా ఉండాలి. వారికీ ఆర్ధిక ప్రయోజనాలు కలిగించి సంపాదన పరులుగా మార్చే విధంగా ఉండలని చాలామంది చెబుతూ ఉంటారు. ఈ విషయాన్ని కొన్ని ప్రభుత్వాలు మాత్రమే దృష్టిలో పెట్టుకుని ప్రజలకు ప్రయోజనాన్ని ఇచ్చే పథకాలను ప్రవేశ పెడతాయి. అలా ప్రవేశ పెట్టిన పథకం మహిళల అదృష్టాన్ని మార్చేసింది. ఇంట్లో కూర్చొనే భారీ ఎత్తున డబ్బులు సంపాదిస్తున్నారు. మొదట్లో పెరటిలో ఉండే వెదురు మొక్కలతో ఆదాయాన్ని పొందేవారు. ఇప్పుడు మిషన్ ద్వారా వెదురు తీసి కళాఖండాలు సృష్టిస్తున్నారు. 

Surya Kala

|

Updated on: Jul 25, 2023 | 11:21 AM

వెదురు క్రాఫ్ట్ అనేది ఛత్తీస్‌గఢ్‌లోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ప్రసిద్ధి చెందిన హస్తకళల్లో ఒకటి. నగరాలు, గ్రామాలతో పాటు చాలా ఇళ్లలో వెదురు క్రాఫ్ట్ కి చెందిన కళాఖండాలు ఏదో ఒక రూపంలో కనిపిస్తూనే ఉన్నాయి. ఇవి సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకూ ప్రజాదరణ పొందుతూనే ఉన్నాయి. మహాసముంద్ జిల్లాలోని స్థానిక గ్రామీణ గిరిజనులు వెదురు క్రాఫ్ట్ ఉపయోగం, ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. దీంతో  వెదురుతో కళాఖండాలను సృష్టిస్తున్నారు. వెదురుతో అనేక ఉపయోగకరమైన, ఆకర్షణీయమైన వస్తువులను  తయారు చేస్తున్నారు. 

1 / 5
వెదురుతో బుట్టలు, చాపలు, చీపురులతో సహా రోజువారీ గృహావసరాలకు సంబంధించిన అనేక వస్తువులను ఇక్కడి గిరిజన మహిళలు తయారు చేస్తున్నారు. మహాసముంద్ జిల్లాలోని డెవలప్‌మెంట్ బ్లాక్ బాగ్‌బహ్రాలో ఛత్తీస్‌గఢ్ స్టేట్ రూరల్ మిషన్ బిహాన్ కింద సుమారు 11 ప్రత్యేక వెనుకబడిన తెగలు అనుసంధానించబడ్డాయి. ఈ తెగలకు చెందిన మహిళలు వెదురుతో బుట్టలు, బొమ్మలు, చాపలు, చీపుర్లు మొదలైనవాటిని తయారు చేస్తున్నారు. ఇలా తాము తయారు చేసిన వెదురు వస్తువులతో ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. ఇంటిని నిర్వహిస్తున్నారు. 

2 / 5
ఈ మహిళలు CRP కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ చక్ర క్రింద వివిధ వెదురు, ఇతర పనుల్లో శిక్షణ పొందారు. ముందుగా గ్రామ పంచాయతీ ధోడ్‌లోని మహాలక్ష్మి గిరిజన మహిళా స్వయం సహాయక బృందాన్ని చేర్చారు. గ్రూప్ ప్రెసిడెంట్ జయమోతిన్ కుమార్ ,సెక్రటరీ రూపాబాయి కుమార్ కలిసి ముందుగా  10 మంది మహిళలను కలిసి ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. వారితో వెదురుతో బొకేలు తయారు చేశారు

3 / 5
ఇదే విషయంపై ప్రమీలా కుమార్ మాట్లాడుతూ.. మొదట్లో తమ తోటలోని వెదురుని ఆదాయ వనరుగా మార్చుకున్నట్లు చెప్పారు. అయితే ఇప్పుడు మిషన్ ద్వారా వెదురును అందుబాటులో తీసుకుని వచ్చారు. ఇప్పుడు పని మరింత సులభం కావడంతో వెదురుతో రకరకాల గృహోపకరణాలను తయారు చేస్తున్నారు.

4 / 5
మహిళలు తయారు చేస్తున్న వెదురు వస్తువులను ప్రభుత్వేతర సంస్థలు కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. దీంతో మహిళల వారి నెలవారీ ఆదాయం భారీగా పెరుగుతోంది. మహిళల జీవన ప్రమాణం కూడా మెరుగుపడుతోంది. జిల్లా పంచాయతీల ద్వారా  18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వయస్సు గల అక్షరాస్యులైన మహిళలకు వారి ఆసక్తికి అనుగుణంగా స్వయం సంవృద్ధి సాధించే దిశగా శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ సమయంలో వెదురుతో బుట్టలు, స్లింగ్స్ బ్యాగ్స్, కూరగాయల బుట్టలు వంటి అనేక రకాల వస్తువుల తయారు చేయడంలో శిక్షణ ఇస్తున్నారు. 

5 / 5
Follow us