Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2 వేల ఏళ్ల నాటి సమాధులు బయటపట్టాయి.. రెండు శవపేటికలపై వివరాలు

ఎప్పుడూ అల్లర్లతో చెలరేగిపోయే పాలస్తీనాలోని గాజా ప్రాంతంలో పురావస్తు శాస్త్రవేత్తలు రెండు వేల ఏళ్లనాటి సమాధులను కనిపెట్టారు. గత ఏడాది బయటపడ్డ పురాతన రోమన్ శ్మశాన వాటికాల్లో తవ్వకాలు జరపగా తాజాగా ఇవి వెలుగులోకి వచ్చాయి.

Aravind B

|

Updated on: Jul 25, 2023 | 11:51 AM

ఎప్పుడూ అల్లర్లతో చెలరేగిపోయే పాలస్తీనాలోని గాజా ప్రాంతంలో పురావస్తు శాస్త్రవేత్తలు రెండు వేల ఏళ్లనాటి సమాధులను కనిపెట్టారు. గత ఏడాది బయటపడ్డ పురాతన రోమన్ శ్మశాన వాటికాల్లో తవ్వకాలు జరపగా తాజాగా ఇవి వెలుగులోకి వచ్చాయి.

ఎప్పుడూ అల్లర్లతో చెలరేగిపోయే పాలస్తీనాలోని గాజా ప్రాంతంలో పురావస్తు శాస్త్రవేత్తలు రెండు వేల ఏళ్లనాటి సమాధులను కనిపెట్టారు. గత ఏడాది బయటపడ్డ పురాతన రోమన్ శ్మశాన వాటికాల్లో తవ్వకాలు జరపగా తాజాగా ఇవి వెలుగులోకి వచ్చాయి.

1 / 5
ఇందులో మొత్తం 125 సమాధులు కనిపెట్టగా.. వీటిలో రెండు శవపేటికలపై కొన్ని వివరాలు కూడా ఉన్నట్లు పాలస్తీనా పురావస్తుశాఖ మంత్రి తెలిపారు. అయితే ఆ వివరాలున్న శవపేటికల మీద ద్రాక్షలు, డాల్ఫిన్ల లాంటి చిత్రాలు ఉన్నట్లు పేర్కొన్నారు.

2 / 5
గతంలోనే స్థానిక అధికారులు వీటిల్లో కొన్నింటిని బయటికి తీశారు. కానీ ఆ తర్వాత ఎక్కువగా ఆధారాలు లభించకపోవడంతో అక్కడే పూడ్చి పెట్టారు. కానీ ఫ్రాన్స్ దేశానికి చెందిన ఓ సంస్థ వీరి తవ్వకాల కోసం తమ వంతు సహకారం అందించింది.

3 / 5
మొదటిసారిగా మేము 125 పురాతన సమాధులున్నటువంటి శ్మశాన వాటికను గుర్తించానని  ఫ్రెంచ్‌ స్కూల్‌ ఆఫ్‌ బైబ్లికల్‌ పురవాస్తు పరిశోధన సంస్థ పరిశోధకుడు ఫదెల్‌ చెప్పారు. 
గుర్తించిన వాటిలో రెండు శవపేటికలపై వివరాలున్నాయని, వీటిని భద్రపరిచేందుకు నిధులు అవసరం అవుతాయని చెప్పారు. చరిత్ర కనుమరుగు కాకూడదంటూ తెలిపారు.

మొదటిసారిగా మేము 125 పురాతన సమాధులున్నటువంటి శ్మశాన వాటికను గుర్తించానని ఫ్రెంచ్‌ స్కూల్‌ ఆఫ్‌ బైబ్లికల్‌ పురవాస్తు పరిశోధన సంస్థ పరిశోధకుడు ఫదెల్‌ చెప్పారు. గుర్తించిన వాటిలో రెండు శవపేటికలపై వివరాలున్నాయని, వీటిని భద్రపరిచేందుకు నిధులు అవసరం అవుతాయని చెప్పారు. చరిత్ర కనుమరుగు కాకూడదంటూ తెలిపారు.

4 / 5
ఇదిలా ఉండగా గత ఏడాది ఈజిప్టు నిధులతో ఓ హౌసింగ్ ప్రాజెక్టు కోసం ఈ ప్రాంతంలో తవ్వకాలు చేశారు. అప్పుడు తొలిసారిగా ఈ శ్మశాన వాటికను కనిపెట్టారు. అయితే ఇప్పుడు చేపట్టిన తాజా తవ్వకాల కోసం దాదాపు 25 మంది దాకా ఇంజినీర్లు, టెక్నిషియన్లు పనిచేశారు. మరో విషయం ఏంటంటే ఈ ప్రాంతంలో ఆ కాలం నాటి మట్టి కుండలు కూడా దొరికాయి. 5

5 / 5
Follow us