Best Smartphones Under 25K: బెస్ట్ ఫీచర్లు.. క్రేజీ ఆఫర్లు.. మంచి 5జీ ఫోన్ కొనాలనుకొంటే ఈ డిస్కౌంట్లు మిస్ అవ్వొద్దు..
మీరు మంచి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? మిడ్‌రేంజ్ లో రూ. 25,000లోపు బడ్జెట్లో బెస్ట్ 5జీ ఫోన్ తీసుకోవాలనుకొంటున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే. మార్కెట్లో టాప్ బ్రాండ్ల స్మార్ట్ ఫోన్లను మీకు అందిస్తున్నాం. పైగా వీటిపై అదిరే డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఉన్నాయి. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్ ఈ ఆఫర్లను అందిస్తోంది. రూ. 25,000 లోపు బడ్జెట్లో బెస్ట్ స్మార్ట్ ఫోన్లు, వాటిపై ఉన్న ఆఫర్లను ఇప్పుడు చూద్దాం..
Madhu |
Updated on: Jul 25, 2023 | 11:25 AM

శామ్‌సంగ్ గేలాక్సీ ఎం34 5జీ.. ఇది సిల్వర్ ప్రిజమ్ కలర్ ఆప్షన్లో అందుబాటులో ఉంది. 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ మెమరీతో ఇది వస్తోంది. 120హెర్జ్ రిఫ్రెష్‌మెంట్ రేట్ తో కూడిన అమోల్డ్ డిస్ ప్లే ఉంటుంది. 50ఎంపీ ట్రిపుల్ నో షేక్ కెమెరాతో ఇది వస్తోంది. 6000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో ఉంటుంది. అమెజాన్‌లో ఈ ఫోన్ కొనుగోలుపై 19శాతం డిస్కౌంట్ లభిస్తోంది. అలాగే పలు బ్యాంకు ఆఫర్లతో కలిపి దీనిని కేవలం రూ. 20,999కే కొనుగోలు చేయొచ్చు. ఇంకా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు పై ఫోన్ తీసుకుంటే మరో రూ. 2000 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. అంటే కేవలం రూ. 17,999కే దీనిని సొంతం చేసుకోవచ్చు. ఎక్స్ చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.

రియల్‌మీ నార్జో 60 ప్రో.. ఇది 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ మెమరీతో వస్తోంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్ ఉంటుంది. 120హెర్జ్ సూపర్ అమోల్డ్ కర్వడ్ డిస్ ప్లే ఉంటుంది. 100ఎంపీ ఓఐఎస్ కెమెరాతో ఈ ఫోన్ వస్తుంది. దీనిపై అమెజాన్‌లో 11శాతం డిస్కౌంట్ ఉంది. ఈ డిస్కౌంట్‌తో ఈ ఫోన్ ని రూ. 23,999కే లభిస్తోంది. అలాగే పాత ఫోన్ ఎక్స్ చేంజ్ పై రూ.21,650వరకూ తగ్గింపును పొందొచ్చు.

రెడ్‌మీ కే50ఐ 5జీ.. ఇది క్విక్ సిల్వర్ కలర్ ఆప్షన్లో అందుబాటులో ఉంటుంది. 6జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యంతో వస్తోంది. మీడియాటెక్ డైమెన్సిటీ చిప్ సెట్ ఉంటుంది. 144హెర్జ్ లిక్విడ్ ఎఫ్‌ఎఫ్‌ఎస్ డిస్ ప్లే ఉంటుంది. అమెజాన్ లో దీనిపై ఏకంగా 34శాతం డిస్కౌంట్ ఉంది. ఈ ఫోన్ అసలు ధర రూ. 31,999కాగా, దీనిని ఇప్పుడు కేవలం రూ. 20,999కే సొంతం చేసుకోవచ్చు. అంతేకాక పలు బ్యాంకు ఆఫర్లు, ఎక్స్ చేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి.

వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ.. దీనిలో క్వాల్‌కామ్ స్నాపడ్రాగన్ 695 5జీ ప్రాసెసర్ ఉంటుంది. 5000ఎంఏహెచ్ సామర్థ్యంతో బ్యాటరీ ఉంటుంది. 67వాట్ల సూపర్ వీఓఓసీ చార్జర్ ఇస్తారు. 8జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. ఇది అమెజాన్‌లో కేవలం రూ. 21,999కే లభిస్తోంది. పలు బ్యాంకు ఆఫర్లతో పాటు ఎక్స్ చేంజ్ ఆఫర్లు ఉన్నాయి. ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 7.5శాతం అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తోంది.

ఒప్పో ఎఫ్23 5జీ.. ఈ ఫోన్‌లో 5000ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. 67వాట్ల సూపర్ వీఓఓసీ చార్జర్ ఉంటుంది. 64ఎంపీ రియర్ ట్రిపుల్ ఏఐ కెమెరా సెటప్ ఉంటుంది. 6.72 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ 120హెర్జ్ డిస్ ప్లే ఉంటుంది. ఈ ఫోన్ పై 14శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీనిని కేవలం రూ. 24,999కే సొంతం చేసుకోవచ్చు. అమెజాన్‌లో దీనిపై పలు బ్యాంక్ ఆఫర్లు ఉన్నాయి.





























