- Telugu News Photo Gallery Technology photos Samsung launching new smart phone samsung galaxy z fold and flip features and price
Samsung: సామ్‌సంగ్ నుంచి మడతపెట్టే ఫోన్‌లు వచ్చేస్తున్నాయ్.. ధర ఎంతో తెలిస్తే బైర్లు కమ్మాల్సిందే
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్‌సంగ్ మార్కెట్లోకి కొత్త ఫోన్‌లను లాంచ్ చేయనుంది. సామ్‌సంగ్ గ్యాలక్సీ జెడ్ ఫోల్డ్ 5, ఫ్లిప్ 5 పేర్లతో రెండు కొత్త ఫోన్‌లను తీసుకురానుంది. అదిరిపోయే లుక్, స్టన్నింగ్ ఫీచర్స్‌తో తీసుకొస్తున్న ఈ ఫోన్లకు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
Updated on: Jul 24, 2023 | 6:44 PM

సామ్‌సంగ్ గ్యాలక్సీ జెడ్ ఫోల్డ్ ధర రూ. 1,49,999గా ఉండనుంది. ప్రారంభ ఆఫర్ కింద మీరు దీన్ని రూ. 1,43,999కే కొనుగోలు చేయవచ్చు. అదేవిధంగా శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 ధర రూ.99,999గా ఉండనుంది. లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా రూ. 94,999గా ఉండనున్నట్లు సమాచారం.

ఈ స్మార్ట్‌ఫోన్‌లను ఈఎమ్‌ఐ ఆప్షన్‌లో కొనుగోలు చేసుకునే వెసులుబాటు కల్పించారు. సామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5ను రూ. 9,428, శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5ను రూ. 6,285 నెలవారీ ఈఎంఐకు కొనుగోలు చేయవచ్చు.

సామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5 ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6.7 ఇంచెస్ మెయిల్ డిస్‌ప్లే, 3.4 ఇంచెస్ కవర్ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. ట్రిపుల్ కెమెరా సెటప్‌తో రానుంది. 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 12 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఇవ్వనున్నట్లు సమాచారం.

ఇక గ్యాలక్సీ జెడ్ ఫోల్డ్ 5లో 7.6 అంగుళాల ఇన్నర్ డిస్‌ప్లే, 6.2 అంగుళాల కవర్ డిస్‌ప్లేతో రానున్నట్లు తెలుస్తోంది. ఇందులో 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 12 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 10 ఎంపీ టెలిఫోటో కెమెరా ఉండనున్నాయి. సెల్ఫీల కోసం 12 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఇవ్వనున్నారు.

ఇదిలా ఉంటే ఈ ఫోన్ ధరలకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదని చెప్పాలి. త్వరలోనే లాంచింగ్‌కు సిద్ధంగా ఉన్న ఈ ఫోన్లకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.





























