- Telugu News Photo Gallery Technology photos Honour launching new tab in india soon Honor pad x9 features and price
Honor Pad X9: హానర్ నుంచి కొత్త ట్యాబ్ వచ్చేస్తోంది.. వావ్ అనిపిస్తోన్న ఫీచర్స్.
హానర్ భారత మార్కెట్లోకి కొత్త ట్యాబ్‌ను లాంచ్ చేయనుంది. హానర్ ప్యాడ్ ఎక్స్9 పేరుతో ఈ ట్యాబ్‌ను తీసుకొస్తున్నారు. ఇప్పటికే ప్రపంచ మార్కెట్లో అందుబాటులోకి వచ్చిన ఈ ట్యాబ్ త్వరలోనే భారత్‌లో అడుగుపెట్టనుంది. ఇంతకీ ఈ ట్యాబ్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
Updated on: Jul 24, 2023 | 6:26 PM

ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం హానర్ భారత మార్కెట్లోకి కొత్త ట్యాబ్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. హానర్ ప్యాడ్ ఎక్స్9 పేరుతో ఈ ట్యాబ్‌ను లాంచ్ చేయనుంది.

ఈ ట్యాబ్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 11.5 ఇంచెస్ హెచ్‌డీ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించనున్నారు. 120 హెచ్‌జెడ్‌తో కూడిన 2కే రిజల్యూషన్ ఈ స్క్రీన్ ప్రత్యేకత.

ఇక ఈ ట్యాబ్లెట్ స్నాప్‌డ్రాగన్ 685 4జీఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను ఇవ్వనున్నారు. వైఫై5, బ్లూటూత్ 5.1 కనెక్టివిటీ, ఆరు స్పీకర్‌లు ఈ ట్యాబ్ ప్రత్యేకత.

ఇక కెమెరా విషయానికొస్తే ఈ ట్యాబ్‌లో 5 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. యూఎస్‌బీ టైప్‌సీ పోర్ట్‌ను అందించనున్నారు. 7250 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ ఈ ట్యాబ్ సొంతం.

లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా హానర్ ప్యాడ్ ఎక్స్9 ట్యాబ్లెట్‌కు ఫ్లిప్ కవర్‌ను అందిస్తున్నట్లు అమెజాన్‌లో ప్రకటించారు. అయితే ఈ ట్యాబ్ ధరకు సంబంధించి ఇంకా ఎలాంటి అధఙకారిక ప్రకటన మాత్రం చేయలేదు.





























