Health: పిల్లల్లో జ్ఞాపకశక్తి తగ్గిపోతుందా ?.. అయితే ఈ ఆహార పదార్థాలు అందించండి..

సాధారణంగా వయసుతో పాటే మెదడు పనితీరు కూడా మందగిస్తుంది. జ్ఞాపకశక్తి సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. చిన్న చిన్న విషయాలను కూడా మర్చిపోతుంటారు.

Health: పిల్లల్లో జ్ఞాపకశక్తి తగ్గిపోతుందా ?.. అయితే ఈ ఆహార పదార్థాలు అందించండి..
Follow us
Basha Shek

| Edited By: Anil kumar poka

Updated on: Jan 23, 2022 | 9:25 AM

సాధారణంగా వయసుతో పాటే మెదడు పనితీరు కూడా మందగిస్తుంది. జ్ఞాపకశక్తి సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. చిన్న చిన్న విషయాలను కూడా మర్చిపోతుంటారు. ఏ విషయంపైనా సరిగా ఏకాగ్రత నిలపలేరు. సాధారణంగా ఈ సమస్యలన్నీ వృద్ధులలో కనిపిస్తాయి. అయితే మారుతోన్న జీవనశైలి కారణంగా యువత, పిల్లల్లో కూడా  మతిమరుపు సమస్య వస్తోంది.  ముఖ్యంగా చదువుకునే విద్యార్థుల్లో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత బాగా తగ్గిపోతోంది.  ఈక్రమంలో వారు వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. అదేవిధంగా కొన్ని ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. పోషకవిలువలు సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. మరి జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం రండి.

ఆకుకూరలు

ఆకు కూరల్లో విటమిన్లతో పాటు పలు రకాల పోషకాలు ఉంటాయి. ఇవి జ్ఞాపకశక్తిని పెంచడంలో బాగా తోడ్పడుతాయి. ముఖ్యంగా మతిమరుపు సమస్య ఉన్నవారు పచ్చని ఆకుకూరలు, కాయగూరలను ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

వాల్ నట్స్

వాల్‌నట్స్ లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు విరివిగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.  అదేవిధంగా ఇందులో ఉండే   ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ గుండె  ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తుంది.

చేపలు

ఆయిల్ ఫిష్ లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది మెదడు  ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు కణాల నిర్మాణానికి చాలా అవసరం. సాల్మన్, మాకేరెల్,  సార్డినెస్, హెర్రింగ్ వంటి చేపలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని కనీసం వారానికి ఒకసారైనా తీసుకుంటే మతిమరుపు సమస్యను అధిగమించవచ్చు.

నల్లరేగు పండ్లు

వీటిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.   వీటిని తీసుకోవడం ద్వారా పెరుగుతున్న వయస్సుతో జ్ఞాపకశక్తి కోల్పోకుండా నిరోధించవచ్చు.  ఇందులో ఉండే విటమిన్ ఇ మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తుంది. రోజుకు 8 నుంచి 10 బెర్రీలు ఆహారంలో చేర్చుకుంటే మంచి ఫలితముంటుందని నిపుణులు చెబుతున్నారు.

పాలు, పెరుగు..

పాలు, పెరుగు,  జున్ను..తదితర డెయిరీ ఉత్పత్తుల్లో ప్రోటీన్లతో పాటు  B విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి మెదడు కణజాలం, న్యూరోట్రాన్స్ మీటర్లు,  ఎంజైమ్‌ల అభివృద్ధికి సహకరిస్తాయి.   పాలల్లో అధికంగా ఉండే క్యాల్షియం దంతాలు, ఎముకలను బలంగా మారుస్తుంది.

Also Read: Coronavirus: తిరుపతి ఐఐటీ క్యాంపస్ లో కరోనా కలకలం.. భారీగా వెలుగు చూసిన పాజిటివ్ కేసులు..

Casino Game: కేసినో నిర్వహణపై టీడీపీ-వైఎస్ఆర్​సీపీల మధ్య మాటల యుద్ధం.. చట్టం ఏం చెబుతోంది..

Signature: మీకు తెలుసా.. అక్కడ ఏ లావాదేవీలకు సంతకంతో పనిలేదు.. మరేం చేస్తారంటే..