AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Signature: మీకు తెలుసా.. అక్కడ ఏ లావాదేవీలకు సంతకంతో పనిలేదు.. మరేం చేస్తారంటే..

బ్యాంక్ లావాదేవీలు.. కొరియర్ తీసుకోవడం.. ఎవరికైనా ఉత్తరం రాయడం.. ప్రభుత్వానికి దరఖాస్తు.. ఇన్సూరెన్స్ పాలసీ.. ఇలా ఏపని చేయాలన్నా మన సంతకం ఉండాల్సిందే. మన సంతకం(Signature) లేకపోతే కాగితంపై ఎటువంటి లావాదేవీనీ నిర్వహించాలేము.

Signature: మీకు తెలుసా.. అక్కడ ఏ లావాదేవీలకు సంతకంతో పనిలేదు.. మరేం చేస్తారంటే..
Signature
KVD Varma
|

Updated on: Jan 22, 2022 | 9:30 PM

Share

బ్యాంక్ లావాదేవీలు.. కొరియర్ తీసుకోవడం.. ఎవరికైనా ఉత్తరం రాయడం.. ప్రభుత్వానికి దరఖాస్తు.. ఇన్సూరెన్స్ పాలసీ.. ఇలా ఏపని చేయాలన్నా మన సంతకం ఉండాల్సిందే. మన సంతకం(Signature) లేకపోతే కాగితంపై ఎటువంటి లావాదేవీనీ నిర్వహించాలేము. కానీ, జపాన్(Japan) దేశంలో మాత్రం సంతకంతో పనిలేదు. మరి వాళ్ళ లావాదేవీ(Transactions)లకు కచ్చితత్వం ఎలా వస్తుంది అనుకుంటున్నారా? వాళ్ళు సంతకానికి బదులుగా స్టాంపులను వినియోగిస్తారు. అవును.. ప్రత్యేకమైన స్టాంపులు దీనికోసం ప్రతి ఒక్కరూ వినియోగించాలి. జపాన్ ప్రజలు సంతకానికి బదులుగా అవి ‘ఇంకన్’ లేదా ‘హాంకో’ అని పిలవబడే ప్రత్యేక రకం స్టాంపులు వినియోగిస్తారు.

అన్నట్టు ఒక్క జపాన్‌లోనే కాదు, కొరియా .. చైనాలోని కొన్ని ప్రాంతాలు కూడా గుర్తింపు కోసం సంతకాలకు బదులుగా స్టాంపులను ఉపయోగిస్తాయి.

హంకో..

హాంకో అనేది ఒక ప్రత్యేక స్టాంప్, దానిపై సంబంధిత వ్యక్తి పేరు కంజీ (జపనీస్ అక్షరాలు)లో చెక్కి ఉంటుంది. ఈ స్టాంపులు చెక్క, ఐవరీ లేదా ప్లాస్టిక్‌తో తయారు చేస్తారు. వీటిలో ‘శునికు’ అని పిలువబడే ఎరుపు రంగు సిరాను ఉపయోగిస్తారు. ఇక్కడ ఉన్న పత్రాలలో సంతకాల కోసం పంక్తులు ఉండవు. కానీ, హాంకో స్టాంపుల కోసం ఒక చిన్న సర్కిల్ ఉంటుంది. వ్యక్తిగత .. వ్యాపార ప్రయోజనాల కోసం ఉపయోగించే హాంకోలో మూడు ప్రధాన రకాలు ఉన్నాయి – జిట్సు-ఇన్, జింకో-ఇన్ .. మైటోమ్-ఇన్. జిట్సు-ఇన్ అంటే ‘నిజమైన ముద్ర’. ఈ స్టాంప్ ఒప్పందంపై సంతకం చేయడానికి ఉపయోగిస్తారు.

మీరు ఒక కంపెనీలో ఉద్యోగం కోసం వెళ్లి, అక్కడ ఒప్పందంపై సంతకం చేయాల్సి వస్తే, మీకు జిట్సు-ఇన్ అవసరం. జిట్సు-ఇన్ స్టాంపులు మీ స్వంత వ్యాపారాన్ని ప్రారంభించడానికి, ఇంటిని కొనుగోలు చేయడానికి లేదా ఇతర చట్టపరమైన పనులను నిర్వహించడానికి ఉపయోగించడం జరుగుతుంది. ఇది చట్టపరమైన ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతుంది కాబట్టి, ఇది తప్పనిసరిగా నగరం అధీకృత కార్యాలయంలో నమోదు చేసి ఉండాలి. దీనితో పాటు మీకు సర్టిఫికేట్ అంటే ‘ఇంకన్ కార్డ్’ అధికారులు ఇస్తారు.

జింకో-ఇన్ స్టాంప్ ఆర్థిక లావాదేవీల కోసం ఉపయోగిస్తారు. వీటిని బ్యాంక్‌లో నమోదు చేసుకోవాలి. పార్శిల్ లావాదేవీ మొదలైన రోజువారీ కార్యకలాపాల కోసం Mitom-in ఉపయోగిస్తారు. ఈ స్టాంపును ఎక్కడా రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. హాంకోలో మీ పేరులో కొంత భాగాన్ని తప్పనిసరిగా కలిగి ఉండాలనేది హాంకో ముఖ్యమైన నియమం. అలాగే, మీ హాంకో పోయినా లేదా దొంగతనానికి గురైనా, మీరు వెంటనే పోలీసులకు తెలియజేయాలి .. హాంకోను రద్దు చేసుకోవాలి. తిరిగి కొత్త హాంకోను పొందాలి.

Also Read: Calcium Rich Foods: ఎముకలు బలంగా ఉండాలంటే.. ఈ 10 ఆహారాలను మీ డైట్‌లో చేర్చాల్సిందే..!

Fitness Tips: ఇలా చేస్తే చాలు.. జిమ్‌కు వెళ్లకుండానే ఇంట్లోనే సులువుగా బరువు తగ్గొచ్చు.. ఫిట్‌గా ఉండొచ్చు.