అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం జరిగితే ఏ నెంబర్లకు కాల్‌ చేయాలి.. నెట్‌వర్క్‌ లేకపోతే ఏం చేయాలి..?

Fire Emergency: ప్రతిరోజూ దేశంలో ఎక్కడో ఓ చోట అగ్నిప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. కొన్నిసార్లు గ్రామాల్లోని గడ్డి వాములు తగలబడగా, మరి కొన్నిసార్లు

అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం జరిగితే ఏ నెంబర్లకు కాల్‌ చేయాలి.. నెట్‌వర్క్‌ లేకపోతే ఏం చేయాలి..?
Fire Brigade
Follow us
uppula Raju

|

Updated on: Jan 22, 2022 | 9:29 PM

Fire Emergency: ప్రతిరోజూ దేశంలో ఎక్కడో ఓ చోట అగ్నిప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. కొన్నిసార్లు గ్రామాల్లోని గడ్డి వాములు తగలబడగా, మరి కొన్నిసార్లు పెద్ద పెద్ద నగరాల్లోని ఇళ్ళు, ఫ్యాక్టరీలలో అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయి. ఈ పరిస్థితులలో అగ్నిమాపక దళం వాహనం సకాలంలో చేరుకుంటే ప్రాణ, ఆస్తి నష్టాన్ని చాలా వరకు తగ్గించవచ్చు. కొన్నిసార్లు మన చుట్టూ అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయి. ఆ సమయంలో అగ్నిమాపక దళం సహాయం ఎలా పొందాలి.. ఏ నంబర్‌కు కాల్ చేయాలి.. అనే విషయాలు తెలిసుండాలి.

మీ దగ్గర సమాచారం ఉంటే మీ పొరుగువారికి సహాయం చేయవచ్చు. పోలీసుల సాయం కావాలంటే ఎమర్జెన్సీ నంబర్ 100 ఉందని అందరికి తెలుసు. ఈ నంబర్‌ని డయల్ చేసిన తర్వాత మీరు పోలీసుల సహాయం పొందుతారు. అదేవిధంగా అగ్నిమాపక దళానికి కూడా ఒక నంబర్ ఉంటుంది. అది 101. అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు 101 నంబర్‌కు కాల్ చేయడం ద్వారా అగ్ని మాపక దళం సంఘటన స్థలానికి చేరుకుంటుంది.

ఎమర్జెన్సీ నంబర్ 112

ప్రభుత్వ వెబ్‌సైట్‌లో అందించిన సమాచారం ప్రకారం.. దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవటానికి కేంద్ర ప్రభుత్వం ‘వన్ నేషన్ వన్ ఎమర్జెన్సీ నంబర్ ‘ 112ను ప్రారంభించింది. మీరు దేశంలోని ఏ ప్రాంతంలో నివసిస్తున్నా ఈ నంబర్‌కు డయల్ చేయడం ద్వారా పోలీసు, అగ్నిమాపక దళం లేదా వైద్య… అత్యవసర పరిస్థితుల్లో మీకు అన్ని విధాలుగా సహాయం చేస్తుంది. ఈ సేవ 24×7 అంటే వారంలో ఏడు రోజుల పాటు పని చేస్తుంది. మీరు ఏ రాష్ట్రం వారైనా పర్వాలేదు. ఏ భాషలో మాట్లాడినా పర్వాలేదు. హిందీ, ఇంగ్లీష్‌లో కూడా సాయం అడగవచ్చు.

112 అంటే ఏమిటి?

112 అనేది సార్వత్రిక ఎమర్జెన్సీ నంబర్. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని ప్రజలు అత్యవసర సమయాల్లో కాల్ చేసి సహాయం పొందవచ్చు. అగ్నిమాపక దళం, వైద్య బృందం లేదా పోలీసుల నుంచి ఒకే కాల్‌లో తక్షణ సహాయం పొందవచ్చు. మీరు మీ మొబైల్ నంబర్ లేదా స్థిర ల్యాండ్‌లైన్ నంబర్‌ ద్వారా కాల్ చేయవచ్చు. ఈ యూనివర్సల్ ఎమర్జెన్సీ నంబర్‌కు కాల్‌ చేయడం ఉచితం.

112 టోల్ ఫ్రీ నంబరా?

112 టోల్ ఫ్రీ నెంబర్. మీరు ఏదైనా రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం నుంచి మీ మొబైల్ ఫోన్ నుంచి అత్యవసర నంబర్ 112కి కాల్ చేయవచ్చు. మొబైల్ నెట్‌వర్క్ అందుబాటులో లేనప్పుడు కూడా మీరు మీ మొబైల్ ఫోన్ నుంచి ఎమర్జెన్సీ నంబర్ 112కి కాల్ చేయవచ్చు. ప్రభుత్వం దేశవ్యాప్తంగా అత్యవసర నంబర్ 112 ను ప్రారంభించింది. దీని వెనుక ఉన్న అతిపెద్ద కారణం ఏంటంటే ప్రపంచం మొత్తం ముఖ్యంగా USA, కెనడా, యూరప్ దేశాలలో అత్యవసర సేవ కోసం 112 నంబర్‌ను ఉపయోగిస్తుంది. దీని కారణంగా చాలా మొబైల్ హ్యాండ్ సెట్‌లలో అత్యవసర కాల్‌ల కోసం 112 నంబర్ ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని TRAI 2015లో అత్యవసర కాల్‌ల కోసం 112 నంబర్‌కు అధికారం ఇచ్చింది.

Memory Power: పిల్లల్లో జ్ఞాపకశక్తి తగ్గిపోతుందా.. ఈ 5 ఆహారాలు వారి డైట్‌లో చేర్చండి..

Gate Exam 2022: గేట్ పరీక్ష వాయిదా పడే అవకాశం.. IIT ఖరగ్‌పూర్ నోటీసు జారీ..?

కేంద్రం గుడ్‌న్యూస్‌.. బడ్జెట్‌లో మరో కొత్త సామాజిక భద్రతా పథకం ప్రకటించే అవకాశం..!