Casino Game: కేసినో నిర్వహణపై టీడీపీ-వైఎస్ఆర్సీపీల మధ్య మాటల యుద్ధం.. చట్టం ఏం చెబుతోంది..
గుడివాడలో కేసినో నిర్వహణపై టీడీపీ-వైఎస్ఆర్సీపీల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది.
గుడివాడలో కేసినో నిర్వహణపై టీడీపీ-వైఎస్ఆర్సీపీల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఇంతకు గ్యాంబ్లింగ్ చట్టాలు ఏమీ చెప్తున్నాయి. రాష్ట్రాలు ఎంత వరకు హక్కు ఉంటుంది ?
ఇండియాలో గ్యాంబ్లింగ్ అనేది రాష్ట్రాల పరిధిలోని అంశం. రాష్ట్ర ప్రభుత్వలు వాళ్లకు నచ్చినట్టుగా గ్యాంబ్లింగ్ విషయంలో చట్టాలు చేసుకోవచ్చు. అయితే దేశంలో గోవా, సిక్కిం రాష్ట్రాలు తప్ప ఇతర రాష్ట్రాలేవి ఇప్పటి వరకు కాసినో గ్యాంబ్లింగ్‌ను లీగల్ చేయలేదు. సమాజంలో జూదంపై ఉండే అభిప్రాయం దృష్టిలో పెట్టుకొని ఇప్పటి వరకు ఏ నాయకుడు అలంటి ప్రయోగాలు చేయలేదు.
కేంద్ర పాలిత ప్రాంతం డామన్‌లో కూడా క్యాసినోలు ఉన్నాయ్. Shikimలో రెండు క్యాసినోలు (కేసినో సిక్కిమ్, కాసినో మహాజోంగ్) ప్రస్తుతం నడుస్తున్నాయి. గోవాలో అత్యధికంగా 12కి పైగా క్యాసినోలు నడుస్తున్నాయి. అందులో 5 వాటర్‌లో, 6 భూమిపై నడుస్తున్నాయి. కాసినో ప్రైడ్, బిగ్ డాడీ, డెల్టిన్ రాయల్, కేసినో డెల్టిన్ ప్రముఖమైనవి. గోవాలోని మండోవి నదిపై ఈ క్యాసినోలు నడుస్తున్నాయి.
నదిపై నడిచే కాసినోలు.. భూమి మీద క్యాసినోలు !
గోవా, డామన్‌లో మొదట కేవలం నదిపై మాత్రమే క్యాసినోలు నిర్వహించుకునే వెసులుబాటు ఇచ్చారు. తర్వాత 1976 టెస్కొని వచ్చిన చట్టాలతో భూమి మీద కూడా క్యాసినోలు నిర్వహించుకోవచ్చు. కానీ అవి 5 స్టార్ హోటల్లో మాత్రమే అనుమతి ఇస్తామని చెప్పడంతో
గ్యాంబ్లింగ్ పై చట్టాలు లేవా అంటే ఉన్నాయి. కానీ అవి పాత చట్టాలు. మారిన పరిస్థితికి తగ్గట్టుగా మార్చలేదు. ఇది రాష్ట్రాల పరిధిలోని నిర్ణయం కావడంతో కేంద్ర కూడా దీనిపై దృష్టి సారించలేదు. అయితే పబ్లిక్ గ్యాంబ్లింగ్ ఆక్టు 1867 అనే ఆక్టును 1976లో సవరణలు చేశారు. ప్రస్తుతం ఆ చట్టం అమలో ఉంది. ఈ చట్టం కేంద్ర ప్రభుత్వం అనువదించుకొని దేశంలో గ్యాంబ్లింగ్‌ను నియంత్రించే ప్రయత్నం చేస్తుంది.
అయితే ఇది పాత చట్టం కావడంతో శిక్షలు కూడా చాల తక్కువగా ఉన్నాయి. గ్యాంబ్లింగ్ క్యాసినోలు అనుమతి లేకుండా నడిపిస్తే 200 రూపాయల జరిమానా, 3 నెలల జైలు శిక్ష మాత్రమే ఉంటుంది. అనుమతి లేని క్యాసినోలకు వెళ్తే 100 రూపాయల ఫైన్, నేల రోజుల పాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.
క్యాసినోలు నడిపించేది ఎవరు ?
ప్రస్తుతము రెండు పెద్ద కంపెనీలు ఈ క్యాసినోలు నడిపిస్తున్నాయి. డెల్టిన్ గ్రూప్, ప్రైడ్ గ్రూప్ ఈ వ్యాపారంలో ఉన్నారు. డెల్టిన్ గ్రూప్ స్టాక్ మార్కెట్లో కూడా లిస్ట్ అయినా కంపెనీ కావడం విశేషం. కేసినో నిర్వహణకు పెద్ద ఎత్తున డబ్బులు కావాల్సి ఉండడడం, రిస్క్ కూడా అదే స్థాయిలో ఉండడంతో కొత్త వాళ్లు ఎవరు ఈ రంగంలోకి రావడానికి ఆసక్తి చూపించడం లేదు.
ఇతర రాష్ట్రాల్లో
భారతదేశంలో గుర్రపు పందాలు, లాటరీలు చట్టబద్ధమే. గుర్రపు పందెం స్కిల్ గేమ్‌గా కాబ్బటి ఇది జూదం పరిధిలోకి రాదు. అనేక భారతీయ రాష్ట్రాలు లాటరీలను కూడా చట్టబద్ధం చేశాయి. గోవా, కేరళ, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, మిజోరాం, మణిపూర్, మేఘాలయ, పంజాబ్, నాగాలాండ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలో లాటరీ లీగల్.
మహారాష్ట్ర జూదాన్ని నిషేధించింది. బాంబే ప్రివెన్షన్ ఆఫ్ గ్యాంబ్లింగ్ యాక్ట్, 1887 ప్రకారం జూదాన్ని చట్టవిరుద్ధంగా పరిగణిస్తుంది. సిక్కిం, నాగాలాండ్‌లో ఈ-గేమింగ్ చట్టబద్ధం చేయబడింది. 1974 యాక్టు ప్రకారం తెలంగాణ గేమింగ్ చట్టం టెస్కొని తెచ్చింది. తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్ స్కిల్ గేమ్ చట్టవిరుద్ధంగా పరిగణిస్తున్నాయి. ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్, ది రమ్మీ ఫెడరేషన్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫాంటసీ స్పోర్ట్స్ తమ అన్ని ప్రకటనల కోసం స్వీయ నియంత్రణ పాటిస్తున్నాయి.
Read Also.. Politics: గురుశిష్యుల మధ్య పోరులో.. పౌరుషాల గడ్డగా మారుతున్న ఆధ్యాత్మిక కేంద్రం..!