AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సైక్లింగ్ vs రన్నింగ్.. ఈ రెండిట్లో ఫిటినెస్​కు ఏది మంచిది..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

సైక్లింగ్‌, రన్నింగ్‌ వంటి కార్డియో వ్యాయామాలు బొడ్డు కొవ్వును వదిలించుకోవడానికి సహాయపడతాయి. రెండూ కేలరీలను బర్న్ చేయగలవు. మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కానీ సైక్లింగ్, రన్నింగ్‌ మధ్య తేడా ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. సైక్లింగ్‌తో పోలిస్తే రన్నింగ్‌తోనే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ మేరకు హార్వర్డ్ యునీవర్సిటీ చేసిన పరిశోధనలో కూడా వెల్లడైంది.

సైక్లింగ్ vs రన్నింగ్.. ఈ రెండిట్లో ఫిటినెస్​కు ఏది మంచిది..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Cycling Vs Running
Jyothi Gadda
|

Updated on: Jun 28, 2025 | 10:52 AM

Share

బెల్లీ ఫ్యాట్.. మీ పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు మీ శారీరక రూపానికి సంబంధించినది మాత్రమే కాదు. మీరు దానిని వదిలించుకోకుంటే.. ఇది మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇది గుండె జబ్బులతో పాటు మధుమేహం వచ్చే ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. మీ పొట్ట పెరుగుతూనే ఉంటే, మీరు జీవనశైలిలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని అర్థం. మీ ఆహారాన్ని మార్చుకోవడమే కాకుండా, శారీరక శ్రమ కూడా తప్పనిసరి అని గుర్తుంచుకోండి. అందుకే ఎల్లప్పుడూ శారీరకంగా ఫిట్​గా, యాక్టివ్​గా ఉండేందుకు చాలా మంది జిమ్‌లకు వెళ్తుంటారు. ఇంట్లోనే యోగా, వాకింగ్‌, రన్నింగ్‌, సైక్లింగ్ వంటి వ్యాయమాలు చేస్తుంటారు. అయితే, సైక్లింగ్ లేదా రన్నింగ్​ఏది బెటర్ అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి. వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం.

సైక్లింగ్‌, రన్నింగ్‌ వంటి కార్డియో వ్యాయామాలు బొడ్డు కొవ్వును వదిలించుకోవడానికి సహాయపడతాయి. రెండూ కేలరీలను బర్న్ చేయగలవు. మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కానీ సైక్లింగ్, రన్నింగ్‌ మధ్య తేడా ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. సైక్లింగ్‌తో పోలిస్తే రన్నింగ్‌తోనే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ మేరకు హార్వర్డ్ యునీవర్సిటీ చేసిన పరిశోధనలో కూడా వెల్లడైంది. ఉదాహరణకు 70 కిలోల బరువు ఉన్న ఒక మనిషి 30 నిమిషాలు గంటకు 5 మీటర్ల వేగంతో రన్నింగ్ చేస్తే 288 కేలరీలు తగ్గుతాడని తేలింది. అదే సైక్లింగ్ చేస్తే 30 నిమిషాలలో 19.3 నుంచి 22.3 మీటర్ల వేగంతో సైక్లింగ్ చేయాలట. వేగం పెంచే కొద్ది శరీరంలోని కేలరీలను ఖర్చు చేయవచ్చట. శరీర కండారలను బలపరిచేందుకు రన్నింగ్ చాలా ఉపయోగపడుతుందట.

రన్నింగ్ చేసే దాని కంటే సైకిల్​ తొక్కడం వల్ల కండరాల సామర్థ్యం పెరుగుతుంది. కానీ, అది మెరుగవడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఎందుకంటే.. సైక్లింగ్‌ వల్ల తక్కువ కేలరీలు మాత్రమే బర్న్ చేస్తుందని అంటున్నారు. మోకాలి నొప్పి వంటి సమస్యలు ఉన్నవారికి ఇది సరైనది కాదు అంటున్నారు. సైక్లింగ్ vs రన్నింగ్‌ ఎది బెటర్‌ అంటే మాత్రం మీరు రెండింటినీ ప్రయత్నించవచ్చు అంటున్నారు నిపుణులు. వారానికి 3 రోజులు సైక్లింగ్ చేయవచ్చు. 2 రోజులు రన్నింగ్‌ చేసుకోవచ్చు. ఇది రోజువారి ఎక్సర్‌సైజ్‌ విధానాన్ని ఎంజాయ్ చేస్తూ చేసేలా ఉంటుంది. వివిధ రకాలుగా కండరాలను ధృడంగా చేస్తుంది. రెండింటిలో ఏది ఎంచుకున్నా గుండెకు ఆరోగ్యకరమనే విషయాన్ని గుర్తుంచుకోవాలంటున్నారు.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..