AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinnamon Water: దాల్చిన చెక్క నీటితో ఈజీగా బరువు తగ్గొచ్చు.. తయారీ విధానం ఎలాగంటే..

దాల్చిన చెక్క వంటల్లో రుచిని పెంచే మసాలా మాత్రమే కాదు.. ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి వున్నాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబతున్నారు. దాల్చిన చెక్క నీటిని ప్రతిరోజూ తాగడం వల్ల మీరు ఊహించని ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారని అంటున్నారు. డయాబెటిస్ నియంత్రణ నుంచి బరువు తగ్గడం వరకు దాల్చిన చెక్క నీరు అద్భుత ప్రయోజనాలను అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. దాల్చిన చెక్క నీరు ఖాళీ కడుపుతో తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. దీనిని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

Jyothi Gadda
|

Updated on: Jun 28, 2025 | 8:19 AM

Share
దాల్చిన చెక్కలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శరీరానికి రక్షణగా పనిచేస్తాయి. దాల్చిన చెక్క ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది ముఖ్యంగా మధుమేహం బాధితులకు మంచిదని చెబుతున్నారు.

1 / 5
దాల్చిన చెక్క నీరు, జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జీవక్రియను వేగవంతం చేసి కొవ్వు కాల్చడానికి సహాయపడుతుంది. దాల్చిన చెక్కలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. దాల్చిన చెక్కలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, శరీరంలోని వాపును తగ్గిస్తాయి.

2 / 5
దాల్చిన చెక్క, శరీర రోగ నిరోధక శక్తిని పెంచి, అంటు వ్యాధుల నుంచి రక్షిస్తుంది. ఈ నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల జలుబు, ఫ్లూ వంటి వ్యాధులు రాకుండా నియంత్రించవచ్చు. దీన్ని తాగడం వల్ల శరీరంలో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదాలను దూరం చేస్తుంది.

3 / 5
దాల్చిన చెక్క మెదడు పనితీరును మెరుగుపరుస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇది అభిజ్ఞా పనితీరు, జ్ఞాపకశక్తి, శ్రద్ధను మెరుగుపరుస్తుంది. అల్జీమర్స్ వ్యాధి వంటి వ్యాధుల ప్రమాదాన్ని దరి చేరకుండా చేస్తుంది. కణాలను దెబ్బతినకుండా రక్షిస్తుంది. ఉదయం లేవగానే ఒక గ్లాసు వెచ్చటి దాల్చిన చెక్క నీరు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. జీవక్రియ రేటు పెరుగుతుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

4 / 5
దాల్చిన చెక్క నీరు తయారీ కోసం ముందుగా ఒక గ్లాసు నీటిని తీసుకుని బాగా మరిగించాలి. ఇప్పుడు ఆ మరిగించిన నీటిలో చిన్న ముక్క దాల్చిన చెక్కను వేసి 5-10 నిమిషాలు నానబెట్టుకోవాలి. దాంతో దాల్చిన చెక్కలోని రుచి, సువాసన, ఆరోగ్యకరమైన లక్షణాలు నీటిలోకి విడుదలవుతాయి. నానబెట్టిన నీటిని వడకట్టి, గోరు వెచ్చగా తాగేయాలి. మీరు కావాలంటే రుచి కోసం తేనె, నిమ్మరసం కూడా యాడ్‌ చేసుకోవచ్చు.

5 / 5