AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Water Bottle: మీ వాటర్‌ బాటిల్స్‌ దుర్వాసన వస్తున్నాయా? ఇది చిటికెడు వేశారంటే తళతళలాడాల్సిందే..

బయటకు వెళ్లిన ప్రతిసారీ మనతోపాటు వాటర్‌ బాటిల్‌ తీసుకెళ్లడం రివాజుగా మారింది. కొందరు ప్లాస్టిక్‌ బాటిల్స్ వినియోగిస్తే... మరికొందరేమో స్టీల్‌, గ్లాస్‌, కాపర్‌ వంటి బాటిల్స్‌కు ప్రాధాన్యం ఇస్తుంటారు. అయితే ఈ బాటిల్స్ ఒక్కోసారి దుర్వాసన వస్తుంటాయి. దీంతో బాటిల్స్‌ నుంచి వచ్చే వాసనను ఎలా తొలగించాలో, వాసన రాకుండా ఎలా నిరోధించాలో తెలియక..

Water Bottle: మీ వాటర్‌ బాటిల్స్‌ దుర్వాసన వస్తున్నాయా? ఇది చిటికెడు వేశారంటే తళతళలాడాల్సిందే..
Water Bottle Cleaning Tips
Srilakshmi C
|

Updated on: Jun 28, 2025 | 11:43 AM

Share

నేటి జీవనశైలి కారణంగా ప్రతి ఒక్కరూ వాటర్‌ బాటిల్‌ వినియోగిస్తున్నారు. బయటకు వెళ్లిన ప్రతిసారీ మనతోపాటు వాటర్‌ బాటిల్‌ తీసుకెళ్లడం రివాజుగా మారింది. కొందరు ప్లాస్టిక్‌ బాటిల్స్ వినియోగిస్తే… మరికొందరేమో స్టీల్‌, గ్లాస్‌, కాపర్‌ వంటి బాటిల్స్‌కు ప్రాధాన్యం ఇస్తుంటారు. అయితే ఈ బాటిల్స్ ఒక్కోసారి దుర్వాసన వస్తుంటాయి. దీంతో బాటిల్స్‌ నుంచి వచ్చే వాసనను ఎలా తొలగించాలో, వాసన రాకుండా ఎలా నిరోధించాలో తెలియక ఇబ్బందిపడిపోతుంటారు. నిజానికి, నీరు మాత్రమే కాకుండా లస్సీ, మజ్జిగ రసం వంటివి ఫ్లాస్క్‌లు, సీసాలలో నిల్వ చేస్తుంటారు. దీని కారణంగా ఈ సీసాలు వాసన రావడం ప్రారంభిస్తాయి. అలాగే డీటాక్స్ వాటర్‌, టీ, కాఫీ వంటివి కూడా వీటిల్లో పోయడం వల్ల… ఈ సీసాల నుంచి వాటి తాలూకు వాసన అంత త్వరగా వదలిపోదు. మరైతే బాటిల్స్‌లో దుర్వాసన ఎలా తొలగించాలి? అని ఆలోచిస్తున్నారా? మరేం పర్వాలేదు.. ఈకింది సింపుల్ టిప్స్ పాటిస్తేసరి. దుర్వాసన చిటికెలో వదలిపోతుంది..

వాటర్ బాటిల్ నుంచి వచ్చే దుర్వాసన తొలగించే చిట్కాలు..

  • బేకింగ్ సోడాను వాటర్ బాటిల్స్ లేదా ఫ్లాస్క్‌ల నుంచి దుర్వాసనను తొలగించడానికి ఉపయోగించవచ్చు. ఒక టేబుల్ స్పూన్ వైట్ వెనిగర్, ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను కొద్దిగా నీటితో కలిపి బాటిల్‌లో పోసి, బాగా కదిలించాలి. ఆ తర్వాత బాటిల్‌ను నీటితో శుభ్రం చేసుకుంటే సరి. బాటిల్ నుంచి వచ్చే దుర్వాసన పూర్తిగా తొలగిపోతుంది.
  • అలాగే బేకింగ్ సోడా, వెనిగర్ తో పాటు, నిమ్మరసం కూడా సీసాల నుంచి దుర్వాసనలను తొలగిస్తుంది. బాటిల్‌లో నిమ్మరసం పోసి దానికి కొద్దిగా నీరు జోడించి, మూతపెట్టి మూసివేసి, బాగా కుదపాలి. ఆపై నాటితో శుభ్రం చేస్తే దుర్వాసన వదలిపోతుంది. ఇందుకోసం నిమ్మకాయ ముక్కలు లేదా నారింజ తొక్కలను కూడా ఉపయోగించవచ్చు.
  • టీ బ్యాగులు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. నీళ్ళు, టీ బ్యాగును వాటర్ బాటిల్ లేదా ఫ్లాస్క్‌లో వేసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఈ నీటిని పారబోసి.. నీటితో శుభ్రం చేయాలి. అంతే బాటిల్‌లోని వాసన ఇట్టే తొలగిపోతుంది.
  • వారానికోసారి సబ్బు నీటితో కూడా బాటిళ్లను శుభ్రం చేయాలి. ఇది దుర్వాసనలను నివారిస్తుంది.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.