Weight Loss Snacks: ఊబకాయాన్ని తగ్గించే స్నాక్స్.. వీటిని రెగ్యులర్ తీసుకుంటే అధిక బరువు హాంఫట్..

ప్రస్తుత కాలంలో అందరూ ఫిట్‌గా ఉండాలని కోరుకుంటారు. కానీ, కొన్ని అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల చాలా మంది స్థూలకాయులుగా మారుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలి.

Weight Loss Snacks: ఊబకాయాన్ని తగ్గించే స్నాక్స్.. వీటిని రెగ్యులర్ తీసుకుంటే అధిక బరువు హాంఫట్..
Weight Loss Tips
Follow us

|

Updated on: Apr 12, 2023 | 9:37 AM

ప్రస్తుత కాలంలో అందరూ ఫిట్‌గా ఉండాలని కోరుకుంటారు. కానీ, కొన్ని అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల చాలా మంది స్థూలకాయులుగా మారుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆహారంపై శ్రద్ధ పెట్టడం ద్వారా బరువు తగ్గించుకోవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. ఆహారంలో కొన్ని పదార్థాలను చేర్చుకోవడం ద్వారా బరువును అదుపులో ఉంచుకోవచ్చు. మీ ఆహారంలో కొన్ని స్నాక్స్‌ని చేర్చుకోవడం ద్వారా మీ బరువును సులభంగా తగ్గించుకోవచ్చని.. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని పేర్కొంటున్నారు. బరువు తగ్గడానికి ఎలాంటి స్నాక్స్ తీసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

బరువు తగ్గడానికి ఈ స్నాక్స్ తీసుకోండి..

శనగలు తినండి: శనగల్లో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి తింటే బరువు తగ్గడంలో సహాయపడుతుంది. దీని కోసం, మీరు చిరుతిళ్లలో వేయించిన శనగల పప్పును తీసుకోవాలి. ఇది కాకుండా, మీరు ఉడకబెట్టిన పప్పు కూడా తినవచ్చు. వేయించిన పప్పు తిన్న తర్వాత మీకు ఆకలిగా అనిపించదు.

ఆహారంలో బాదంను చేర్చుకోండి: బాదంలో చాలా ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. బాదం తీసుకోవడం వల్ల బరువు కూడా తగ్గుతుంది. అటువంటి పరిస్థితిలో, సాయంత్రం వేళల్లో బాదంపప్పును తినవచ్చు. దీనిద్వారా జీర్ణ సమస్యలు దూరమవుతాయి. సరైన జీర్ణక్రియ కారణంగా, అదనపు కొవ్వు శరీరంలో ఉండదు. దీంతో ఫిట్‌గా మారుతారు. అందుకే స్నాక్స్‌లో బాదంను చేర్చుకోండి..

ఇవి కూడా చదవండి

తృణధాన్యాలు – విత్తనాలు: బరువు తగ్గడానికి విత్తనాలు తీసుకోవాలి. మీరు వీటిని రెగ్యులర్ స్నాక్స్‌లో తీసుకోవచ్చు. బరువు తగ్గడానికి సొరకా, గుమ్మడికాయ, అవిసె, పుచ్చకాయ లాంటి గింజలను తినవచ్చు.

బఠానీలు: బఠానీలను స్నాక్స్‌గా తినవచ్చు. అదే సమయంలో, దీనిని తీసుకోవడం బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇంకా వీటిని వేయించి కూడా తినవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..