కేరళా వెళ్తున్నారా.. మిస్ అవ్వగుండా చూడాల్సిన ప్రదేశాలివే!
Samatha
29 December 2025
న్యూ ఇయర్, సంక్రాంతి పండుగ వచ్చేస్తోంది. ఈ సెలవుల్లో చాలా మంది టూర్ వెళ్లడానికి ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. అయితే అలాంటి వారికోసమే ఈ సమాచారం.
సంక్రాంతి సెలవుల్లో చాలా మంది కేరళ వెళ్లడానికి ప్లాన్ చేస్తుంటారు. అయితే కేరళ వెళ్లిన వారు తప్పకుండా అక్కడ కొన్ని ప్రదేశాలు చూసి రావలంట. అవి ఏవో చూద్దాం.
మున్నార్, కేరళలో ఉన్న అందమైన ప్రదేశాల్లో మున్నార్ ఒకటి. ఇక్కడి అందమైన టీ తోటలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయి. అందుకే తప్పకుండా మున్నార్‌ను సందర్శించాల్సిందే.
అలాగే, అలెప్పీ నగరం చాలా ఆకర్షణీయంగా, అద్భుతంగా ఉంటుంది. ఈ ప్రదేశ చూడకపోతే కేరళ అందాలు మిస్ అయినట్లే, అందుకే తప్పక చూడాల్సిన ప్లేస్‌ల్లో అలెప్పీ ఒకటి.
బీచ్ చూస్తూ ఎంజాయ్ చేయాలి అని ఎవరు కోరుకోరు, అయితే కేరళలో కోవలం సముద్ర తీరం చాలా అందంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది.
ట్రెక్కింగ్ చేయాలి, ప్రకృతిలో ఆనందంగా గడపాలి అనుకునే వారు తప్పక సందర్శించాల్సిన ప్రదేశం వయినాడ్, ఇక్కడి అడవి, జలపాతాలు ప్రశాంతతను ఇస్తాయి.
అదే విధంగా కేరళ వెళ్లిన వారు తప్పకుండా తిరువనంతపురం చూడకుండా రాకూడదంట. ఇక్కడి ఆలయాలు, ప్రకృతి మానసిక ప్రశాంతతను పెంచుతాయి.
అలాగే కేరళలోని తిరువనంతపురం జిల్లాలో ఉన్న పూవర్ ప్రదేశం అందమైన ప్లేసెస్‌లో ఒకటి. ఇకకడి సముద్రం ఆహ్లాదకర వాతావరణాన్ని అందిస్తుంది.