AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Ideas: కొత్త వ్యాపార ఆలోచనలకు బాటలు వేస్తోన్నవేసవి.. వీడియో చూసి వ్యాపారం ప్రారంభించిన మహిళ..

చిన్న చిన్న ఆలోచనలతో తమ జీవితంలో భారీ మార్పులను తీసుకొస్తున్నారు. తమ జీవితానికి  స్వావలంబనగా  మార్చుకుంటున్నారు. అందుకు ఉదాహరణగా నిలుస్తున్నారు ఈ మహిళలు. కర్ణాటకకు చెందిన ఓ మహిళ అనుకోని కారణాల వలన ఉద్యోగానికి గుడ్ బై చెప్పేసింది. అయితే ఆర్ధిక అవసరాలను తీర్చుకోవడానికి పనిచేయడం తప్పని సరి.. దీంతో యూట్యూబ్ వీడియోలను చూస్తూ.. వ్యాపారం చేయాలని నిర్ణయించుకుంది.

Business Ideas: కొత్త వ్యాపార ఆలోచనలకు బాటలు వేస్తోన్నవేసవి.. వీడియో చూసి వ్యాపారం ప్రారంభించిన మహిళ..
Shwetha is selling ‘raagi ambali’
Surya Kala
|

Updated on: Apr 12, 2023 | 8:22 AM

Share

మహిళా ఆంట్రప్రెన్యూర్‌షిప్, మహిళా సాధికారత వంటి ఆలోచనలు సమాజంలోని బడుగు బలహీన వర్గాల మహిళలకు అంతగా తెలియవు. అయినప్పటికీ.. చాలామంది మహిళలు తమకు తెలియకుండానే చిన్న చిన్న ఆలోచనలతో విజయవంతమైన వ్యవస్థాపకులుగా మారారు. అంతేకాదు చిన్న చిన్న ఆలోచనలతో తమ జీవితంలో భారీ మార్పులను తీసుకొస్తున్నారు. తమ జీవితానికి  స్వావలంబనగా  మార్చుకుంటున్నారు. అందుకు ఉదాహరణగా నిలుస్తున్నారు ఈ మహిళలు. కర్ణాటకకు చెందిన ఓ మహిళ అనుకోని కారణాల వలన ఉద్యోగానికి గుడ్ బై చెప్పేసింది. అయితే ఆర్ధిక అవసరాలను తీర్చుకోవడానికి పనిచేయడం తప్పని సరి.. దీంతో యూట్యూబ్ వీడియోలను చూస్తూ.. వ్యాపారం చేయాలని నిర్ణయించుకుంది. తాజాగా రాగి అంబలిని విక్రయిస్తూ ఆదాయాన్ని సృష్టించుకుంది. వివరాల్లోకి వెళ్తే..

మైసూర్ నగరంలోని జయనగర్‌లో నివాసం ఉంటున్న ఇద్దరు పిల్లల తల్లి శ్వేతా తిలక్ కుమార్. ఓవైపు కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూనే మరోవైపు ఉద్యోగం చేయాల్సి వచ్చేది. అయితే రెండిటికి వీలు కుదరక పోవడంతో.. ఏడాది వ్యవధిలో రెండు ఉద్యోగాలు వదిలేసింది. అయితే తన కుటుంబ ఆర్థిక అవసరాలను తీర్చడానికి కొత్త మార్గాన్నిసృష్టించుకుంది. వేసవి వచ్చేసింది. రోజు రోజుకీ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకున్న శ్వేతా తిలక్ స్ట్రీట్ ఫుడ్ విక్రేతగా మారింది.

‘రాగి అంబలి’, మినరల్ వాటర్ ఉపయోగించి తయారుచేసిన మజ్జిగ అమ్మడం ప్రారంభించింది. తన  ఆలోచనవలన ఓ వైపు కుటుంబ బాధ్యతలను చూసుకోవడంతో పాటు.. మరోవైపు తన భర్తను ఆర్థికంగా అండగా నిలబడింది.  అయితే ఈ రాగి అంబలి బిజినెస్ ఐడియా యూట్యూబ్ నుండి తనకు వచ్చినట్లు శ్వేతా తిలక్ చెప్పింది.

“తనకు ఇద్దరు చిన్న పిల్లలు.. రోజు మొత్తం ఉద్యోగాని కేటాయించలేకపోతున్నా అందుకని రెండు ఉద్యోగాలు వదులుకోవలసి వచ్చిందని చెప్పింది. తన భర్త టీ వ్యాపారి. కానీ, వేసవిలో టీ, కాఫీలకు అంత డిమాండ్ ఉండదు. కనుక డబ్బు సంపాదించడానికి తాను భిన్నంగా ఏదైనా చేయాలనుకున్నాను. ఆ సమయంలోనే యూట్యూబ్‌లో అనుకోకుండా చూసిన ఓ వీడియోతో బిజినెస్ ఐడియా వచ్చింది. మినరల్ వాటర్‌తో ‘రాగి అంబలి’, మజ్జిగ తయారు చేయాలనే ఆలోచన వచ్చింది’’ అని చెప్పింది.

ఈ విషయం చెప్పిన వెంటనే తన కుటుంబం మద్దతుగా నిలిచింది. గత మూడు వారాలుగా.. తాను కూడా వ్యాపార సమయంలో వస్తున్నట్లు.. మినరల్ వాటర్ వాడుతున్నందున డిమాండ్ కూడా బాగానే ఉంది’’ అని ఆమె తెలిపారు.

“కొన్ని గంటల్లో రూ. 700 నుండి రూ. 750 వరకు సంపాదిస్తున్నాని.. ఖర్చులను తీసివేస్తే.. దాదాపు రూ. 500 లాభాన్ని పొందుతున్నట్లు చెప్పింది శ్వేతా.  ఎక్కువగా రవాణా ఛార్జీలు కూడా అవ్వవు. అంతేకాదు రోజంతా ఇంటి బయట ఉండాల్సిన అవసరం లేదు. దీంతో కుటుంబాన్ని , వ్యాపారాన్ని కలిసి నిర్వహించగలుగుతున్నానని చెప్పింది శ్వేత. గ్రాడ్యుయేషన్ తర్వాత పై చదువు చదవలేదని తెలిపింది శ్వేత.

అయితే ఇది ఒక్క శ్వేత వ్యాపార కథామాత్రమే కాదు. ఉష్ణోగ్రతలు పెరగడంతో.. భిన్నమైన ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన చాలా మంది మహిళలు వంటగదిలో తమ నైపుణ్యాలను ఉపయోగించి వివిధ చిన్న వ్యాపారాలను చేస్తున్నారు.

మైసూరు ప్యాలెస్ సమీపంలో తన స్టాల్‌ను ప్రారంభించిన పవిత్ర సందేశ్ కుమార్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వేసవి దాహార్తిని తీర్చడం కోసం మసాలా మజ్జిగను విక్రయిస్తోంది పవిత్ర. ఆమె తన తల్లి నుండి ఈ నైపుణ్యాన్ని వారసత్వంగా పొందింనట్లు పేర్కొంది. పని ఒత్తిడి లేకుండా లేదా ఒకే చోట ఎక్కువ గంటలు గడపకుండా డబ్బు సంపాదించడానికి ఇది సులభమైన మార్గమని చెప్పింది. ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే, రోజు 12 గంటలు పని చేయాలనీ.. నెలకు రూ. 10,000 నుండి రూ. 12,000 వరకు ఇస్తారని చెప్పింది పవిత్ర. అయితే నేను ఈ బిజినెస్ ను సౌకర్యాన్ని బట్టి రోజును ప్లాన్ చేసుకుంటాను.. రోజుకు  రూ.500 నుంచి రూ.600 సంపాదించడం కష్టమేమీ కాదు’ అని పవిత్ర చెప్పారు.

నగరంలో ఒక హోటల్‌ను నడుపుతున్న శ్వేత మడప్పాడి .. ఇదే విషయంపై మాట్లాడుతూ.. ఆడపిల్లకు చిన్నతనంలోనే వంట చేసే నైపుణ్యం నేర్పిస్తారు. అందువల్ల తమ వంటింటి పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని ఉపయోగించి రుచికరమైన ఆహారాన్ని శుభ్రంగా అందిస్తే.. కస్టమర్స్ కు కొదవు ఉండదని తెఇల్పింది శ్వేత. తనకు అందుబాటులో ఉన్న సమయానికి అనుగుణంగా ప్రణాళికలు వేసుకుని పని చేసుకోగలం. కనుక ఒకరి క్రింద పనిచేయడం కంటే వ్యవస్థాపకత ఎల్లప్పుడూ ఉత్తమమైనది. డ్యూటీ అవర్ ఎనిమిది గంటలు అయితే, దాని కోసం 10 గంటలు రిజర్వ్ చేసుకోవాలి. ఈ రకమైన ప్రయోగాలు పరిమిత సమయం, తక్కువ స్థలంలో మహిళలు ఎక్కువ సంపాదించడానికి సహాయపడుతున్నాయి, ”అని శ్వేత మడప్పాడి చెప్పారు. నేటికీ పిల్లలను చూసుకోవడం, ఇంటిపని మొదలైనవి మహిళల భుజాలపైనే ఉన్నాయని, ఈ రకమైన చిన్న వ్యాపారాలు వారు స్వతంత్రంగా మారడానికి సహాయపడతాయని చెప్పారు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..