Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pregnancy Diet Plan: ఎండల్లో గర్భిణుల రోగనిరోధక శక్తిని పెంచండిలా.. రోజువారీ ఆహారంలో ఈ మార్పులు చేస్తే చాలు

ప్రస్తుతం ఎండలు దంచి కొడుతున్నాయి. ముఖ్యంగా వాతావరణ మార్పుల నేపథ్యంలో గర్భిణులు ఆహారంతో పాటు ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా గర్భిణుల ఆహారంలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్‌ వంటివి ఉండేలా చూసుకోవాలని పేర్కొంటున్నారు.

Pregnancy Diet Plan: ఎండల్లో గర్భిణుల రోగనిరోధక శక్తిని పెంచండిలా.. రోజువారీ ఆహారంలో ఈ మార్పులు చేస్తే చాలు
Pregnancy
Follow us
Srinu

|

Updated on: Apr 12, 2023 | 7:00 PM

అమ్మతనం అనేది ప్రతి మహిళ అనుభూతి చెందాలనుకుంటుంది. అందుకోసం మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా గర్భధారణ సమయంలో అయితే మరింత జాగ్రత్తగా ఉంటారు. గర్భం దాల్చిన సమయంలో స్త్రీ శరీరం అనేక మార్పులను ఎదుర్కొంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో ఆరోగ్యకరమైన జీవనశైలితో పోషకమైన ఆహారాన్నితీసుకోవడం కూడా కీలకం. ప్రస్తుతం ఎండలు దంచి కొడుతున్నాయి. ముఖ్యంగా వాతావరణ మార్పుల నేపథ్యంలో గర్భిణులు ఆహారంతో పాటు ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా గర్భిణుల ఆహారంలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్‌ వంటివి ఉండేలా చూసుకోవాలని పేర్కొంటున్నారు. ఎందుకంటే ఇవి అధికంగా తీసుకుంటే వేసవిలో అధిక శక్తిని అందించడంతో పాటు హైడ్రేట్‌గా ఉండడంతో సాయం చేస్తుంది. గర్భిణులకు వేసవిలో సమతుల్య ఆహారం చాలా ముఖ్యం. ఇది పిల్లల పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తుంది. రోగనిరోధక వ్యవస్థ సరైన పనితీరుతో పాటు తల్లి, బిడ్డ ఇద్దరి మొత్తం ఆరోగ్యానికి కూడా ఇది సమతుల్య ఆహారం చాలా అవసరం. ముఖ్యంగా సూర్యరశ్మికి ఎక్కువసేపు గురికాకుండా ఉండడంతో పాటు గాలి ప్రసరించడానికి అనుమతించే వదులుగా, సౌకర్యవంతమైన దుస్తులను ధరించాలని నిపుణులు చెబుతున్నారు. ఆహారం విషయానికి వస్తే గర్భిణులు పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్‌తో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. కాబట్టి నిపుణులు సూచించే ఆ ఆహార పదార్థాలు ఏంటో ఓ సారి చూద్దాం.

మాంసం

మాంసాహారంలో గర్భిణులకు జింక్ అధికంగా ఉంటుంది. అలాగే ఇతర ప్రోటీన్లు కూడా శరీరానికి అందుతాయి. ఒకసారి మాంసాహార భోజనం చేస్తే 20 గ్రాముల ప్రోటీన్, 10 గ్రాముల కొవ్వు, 176 కేలరీలను అందిస్తుంది. అదనంగా ఐరన్, క్రియేటిన్ బీ విటమిన్లు వంటి ఇతర ముఖ్యమైన పోషకాలు అందుతాయి.

ఆకుకూరలు

ప్రోటీన్, ఫైబర్, జింక్ వంటి ఆరోగ్యకరమైన పోషకాలు ఆకు కూరల్లో అధికంగా ఉంటాయి. వీటిని సలాడ్‌లు, కూరలు, సూప్‌ల ద్వారా గర్భిణులు అధికంగా తీసుకుంటే శరీరానికి పోషకాలను అందిస్తుంది. శాకాహారులు వీటిని తీసుకుంటే మాంసం తిన్నంత బలం వస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. 

ఇవి కూడా చదవండి

గింజల ఆహారం

మీ ఆహారంలో పోషకమైన విత్తనాలను జోడించడం ద్వారా జింక్ శరీరానికి అందుతుంది. ముఖ్యంగా గుమ్మడికాయ, స్క్వాష్, నువ్వులు ఆహారంలో చేర్చుకుంటే జింక్‌తో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, ఖనిజాలు వంటి శరీరానికి అందుతాయి. 

డ్రై ఫ్రూట్స్‌

డ్రై ఫ్రూట్స్‌తో పాటు వేరుశెనగలకు గర్భిణులు అల్పాహారంగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తుననారు. ఎందుకంటే ఇందులో జింక్ అధికంగా ఉంటుంది. ముఖ్యంగా రోజువారీ ఆహారంలో జీడిపప్పు, బాదంతో వేరుశెనగ ఉండాలని చెబుతున్నారు. వీటి ద్వారా అధిక ఫైబర్, మంచి కొవ్వులు, విటమిన్లు శరీరానికి అందుతాయని, అందువల్ల తల్లీ బిడ్డ ఆరోగ్యానికి మేలు చేస్తాయని పేర్కొంటున్నారు.

పాలు

గర్భిణులు రోజూ పాలు తాగడం వల్ల ఎముకల ఆరోగ్యం మెరుగుఅవుతుంది. ముఖ్యంగా కడుపులో పెరిగే బిడ్డ ఎముకలను బలంగా చేయడంలో చాలా కీలక పాత్ర పోషిస్తాయి. పాలు అధికంగా తాగితే జింక్‌తో పాటు ప్రోటీన్, కాల్షియం, విటమిన్ డి శరీరానికి అందుతాయి. 

తృణధాన్యాలు

గోధుమలు, క్వినోవా, వోట్స్ వంటి తృణధాన్యాల్లో కూడా జింక్‌ అధికంగా ఉంటుంది. రోజువారి ఆహారంలో వీటిని ఉండేలా గర్భిణులు జాగ్రత్తలు తీసుకుంటే శరీరానికి చాలా మేలు చేస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మాస్టర్ బ్లాస్టర్ స్టైల్‌లో కమిన్స్ అప్పర్-కట్
మాస్టర్ బ్లాస్టర్ స్టైల్‌లో కమిన్స్ అప్పర్-కట్
బంగారాన్ని ఎక్కువ కాలం వాడకపోతే తుప్పు పడుతుందా?
బంగారాన్ని ఎక్కువ కాలం వాడకపోతే తుప్పు పడుతుందా?
కాలేజ్‌ క్యాంపస్‌లో తిరుగుతున్న భారీ మొసలి వీడియో వైరల్
కాలేజ్‌ క్యాంపస్‌లో తిరుగుతున్న భారీ మొసలి వీడియో వైరల్
ఇదేం చేస్తుందిలే అని చీప్‌గా చూసేరు.. ఆ సమస్యలకు బ్రహ్మాస్త్రం..
ఇదేం చేస్తుందిలే అని చీప్‌గా చూసేరు.. ఆ సమస్యలకు బ్రహ్మాస్త్రం..
ఆరుగురు హీరోయిన్స్ తర్వాత విజయ్ సినిమాలో ఆమె ఫిక్స్ అయ్యిందా..?
ఆరుగురు హీరోయిన్స్ తర్వాత విజయ్ సినిమాలో ఆమె ఫిక్స్ అయ్యిందా..?
మీ మతిమరుపునకు అసలు కారణం తెలిస్తే.. వీడియో
మీ మతిమరుపునకు అసలు కారణం తెలిస్తే.. వీడియో
సంగారెడ్డిలో ఘోరం..ముగ్గురు పిల్లల‌కు విష‌మిచ్చి తానూ తాగిన తల్లి
సంగారెడ్డిలో ఘోరం..ముగ్గురు పిల్లల‌కు విష‌మిచ్చి తానూ తాగిన తల్లి
ఈ పండు తినాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే.. వీడియో
ఈ పండు తినాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే.. వీడియో
అమెరికా వెళ్లాలనుకునే విద్యార్ధులకు షాక్‌.. ట్రంప్ ఏం చేశారంటే?
అమెరికా వెళ్లాలనుకునే విద్యార్ధులకు షాక్‌.. ట్రంప్ ఏం చేశారంటే?
ముల్లును ముల్లుతోనే తీయాలి.. తూర్పు లద్దాఖ్‌లో అధునాతన బలగాలు
ముల్లును ముల్లుతోనే తీయాలి.. తూర్పు లద్దాఖ్‌లో అధునాతన బలగాలు