Yoga in Pregnancy: గర్భిణీ స్త్రీలు మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ సింపుల్ యోగాసనాన్ని ట్రై చేస్తే సరి..
Yoga in Pregnancy: అమ్మతనంలోని కమ్మదనం కోసం స్త్రీ ఎన్ని కష్టనష్టాలు అయినా సంతోషంగా అనుభవిస్తుంది. గర్భిణీగా ఉన్న సమయంలోనే పుట్టబోయే బిడ్డ కోసం..
Yoga in Pregnancy: అమ్మతనంలోని కమ్మదనం కోసం స్త్రీ ఎన్ని కష్టనష్టాలు అయినా సంతోషంగా అనుభవిస్తుంది. గర్భిణీగా ఉన్న సమయంలోనే పుట్టబోయే బిడ్డ కోసం ఆలోచిస్తుంది. అందంగా ఆరోగ్యంగా బిడ్డపుట్టలని ప్రతి తల్లి కోరుకుంటుంది. అయితే గర్భిణీతో ఉన్న స్త్రీ తన పుట్టబోయే బిడ్డకు మేలు చేయడం కోసం చిన్నపాటి యోగాసనాలు వేయడం మేలు చేస్తాయి. అటువంటి యోగాసనాల్లో ఒకటి అర్ధ ఉత్తానాసనం.. దీనిని ఎలా వేయాలి.. ఉపయోగాలు గురించి తెలుసుకుందాం..
యోగాసనం వేసే పధ్ధతి:
*ముందుగా రెండు కాళ్ల మధ్య ఒక అడుగు దూరం ఉండేలా తాడాసన స్థితిలో నిలబడాలి. తర్వాత మెల్లగా శ్వాస మెల్లగా తీసుకుంటూ రెండు చేతులు పైకి ఎత్తాలి. తర్వాత శ్వాసని వదులుతూ నడుం కిందకి నిదానంగా వంచుతూ.. ఎత్తిన రెండు చేతులను అరచేతులతో కాలి వేళ్ళను తాకించాలి. అయితే గర్భిణీ స్త్రీలకు కాలిని తాకడం సాధ్యం కాదు కనుక చేతులు తాకేలా కొంచెం ఎత్తుని ఏర్పాటు చేసుకోవచ్చు. అప్పుడు ఆ ఎత్తుని తాకవచ్చు. మోకాళ్ళు వంగకుండా ఛాతీని విశాలంగా చేసుకుని అర నిమిషం పాటు ఉండాలి. నిదానంగా శ్వాసను తీసుకోవాలి. అయితే ఈ ఆసనం వేస్తున్నంత సేపు కాలివేళ్లపై శరీరం బరువు పడేలా చూసుకోవాలి. అంతేకాదు కాళ్ళమధ్య, చేతుల మధ్య దూరం ఒకేలా ఉండేలా చూసుకోవాలి.
ఈ ఆసనం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు: గర్భిణీ స్త్రీలు ఎదుర్కొనే మల బద్దకాన్ని నివారిస్తుంది. అంతేకాదు గర్భస్థ శిశువు పెరుగుదలకు మంచి సహాయకారి ఈ ఆసనం. గర్భసంచిని శిశువు సౌకర్యంగా ఉండేలా చేస్తుంది. జీర్ణక్రియ సక్రమంగా ఉండేలా రసాలను ఉత్పత్తి చేస్తుంది.
గమనిక: అయితే ఈ ఆసనాన్ని గర్భిణీ స్త్రీలు వేసే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. ముఖ్యంగా వాంతులు అయ్యే గర్భిణీలు, నీరసంగా ఉండేవారు ఈ ఆసనానికి దూరంగా ఉండడం మంచిది.
Also Read : నీ స్మృతిలో.. గున్న ఏనుగుకి పునీత్ రాజ్ కుమార్ పేరు పెట్టిన అటవీ శాఖ అధికారులు..
విద్యుత్ తీగకు గ్యాస్ సిలిండర్ తగిలి.. డెలివరీ బాయ్ దుర్మరణం..