Gas Cylinder: విద్యుత్ తీగకు గ్యాస్ సిలిండర్ తగిలి.. డెలివరీ బాయ్ దుర్మరణం..
Gas Cylinder: తెలంగాణ లోని నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పసుపుల గ్రామ లో 11 కెవి వైర్లు తగిలి కరెంటు షాకుతో కురుమయ్య( 46) అనే..
Gas Cylinder: తెలంగాణ లోని నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పసుపుల గ్రామ లో 11 కెవి వైర్లు తగిలి కరెంటు షాకుతో కురుమయ్య( 46) అనే గ్యాస్ డెలివరీ బాయ్ మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. గ్యాస్ సిలెండర్ డెలెవరి ఇచ్చేందుకు పరమహంస ధ్యాన యోగ ఆశ్రమానికి బొలేరో వాహనం వెళ్ళింది. ఆశ్రమంలో సిలెండర్లు డెలివరి ఇవ్వడం కోసం.. కురుమయ్య సిలెండర్ తీస్తుండగా కరెంటు తీగలు తగిలాయి. దీంతో కరెంటు షాకుకు గురైన కురుమయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. 11 కెవి కరెంటు తీగలు కిందికి వేలాడుతూ ఉండడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్ష్యులు చెప్పారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లనే నిండు ప్రాణాలు పోయాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రమాదానికి ఆశ్రమ నిర్వాహకులు కూడా బాధ్యత వహించాలని స్థానికులు కోరుతున్నారు.
Also Read: