AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Local Body Elections: ఏపీలో మిగిలిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి నేటితో తెర.. 14,15, 16 తేదీల్లో పోలింగ్

ఏపీలో ముగిసిన మున్సిపల్‌ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. 12 నగర పంచాయితీల్లో హోరాహోరీగా సాగిన ప్రచారానికి ఎండ్‌ కార్డు పడింది.

AP Local Body Elections: ఏపీలో మిగిలిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి నేటితో తెర.. 14,15, 16 తేదీల్లో పోలింగ్
Ap Local Body Election
Balaraju Goud
|

Updated on: Nov 13, 2021 | 5:28 PM

Share

AP Local Body Elections 2021: ఏపీలో ముగిసిన మున్సిపల్‌ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. 12 నగర పంచాయితీల్లో హోరాహోరీగా సాగిన ప్రచారానికి ఎండ్‌ కార్డు పడింది. ముఖ్యంగా చిత్తూరు జిల్లా కుప్పంపై కుస్తీ పట్టుపట్టాయి టీడీపీ, వైసీపీలు. నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈనెల 15న పోలింగ్‌ నిర్వహించి, ఈనెల 17న కౌంటింగ్‌ చేపట్టాలన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.

ఏపీలో మిగిలిపోయిన స్థానిక సంస్థలకు ఈనెల 15న ఎన్నికలు జరుగుతున్నాయి. నెల్లూరు నగర కార్పొరేషన్ ఇందులో ఒకటి. 54 డివిజన్లలో 8 ఏకగ్రీవం కాగా మిగతా 46 చోట్ల వైసీపీ, టీడీపీతో పాటూ జనసేన, కొన్ని చోట్ల వామపక్షాల అభ్యర్థులు కూడా బరిలో నిలిచాయి. ఢీ అంటే ఢీ అంటూ అధికార పార్టీతో తలపడేందుకు సిద్ధమవుతున్నారు. ఓ వైపు భారీ వర్షాల్లోనూ, దాదాపుగా ప్రచారాలను కూడా పూర్తి చేసుకున్నారు. ఇక అసలు ఘట్టం ఇప్పటి నుంచే మొదలు కానుంది. మరో రెండు రోజుల్లో పోలింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఓటర్లను ప్రసన్నంచేసుకునే పనిలో పడ్డారు అభ్యర్థులు.

నెల్లూరులో కార్పొరేటర్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారంతా భారీగానే ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఏకగ్రీవాల కోసం టీడీపీ నేతలకు భారీగా నగదును ఎరచూపి, నామినేషన్లను విత్ డ్రా చేసుకునేలా చేశారనే ప్రచారం వినిపిస్తోంది. మరికొందరిని ప్రచారం చేయనీయకుండా చేయడంలో వైసీపీ నేతలు సక్సెస్ అయ్యారు. ఏకగ్రీవాలు అయిన డివిజన్ల మినహా మిగిలిన డివిజన్లలో నేటి నుంచి నగదు పంపిణీ జరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇక్కడ కూడా పంపకాల విషయంలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో టీడీపీ ముక్కుపుడకలు పంచిందని వైసీపీ ఆరోపిస్తోంది. మరోవైపు చిత్తూరు జిల్లాలోని కుప్పంలోనూ లోకేష్ పర్యటనలోనగదు పంచేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కుప్పం మున్సిపాలిటీ పోరు సెగలు రేపుతోంది. వైసీపీ జెండా ఎగరేయటానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. గెలుపు కోసం వైసీపీ, టీడీపీ గట్టి వ్యూహాలే రచిస్తున్నాయి. అక్రమాలు జరుగుతున్నాయని వరస పెట్టి రాష్ట్ర ఎన్నికల సంఘానికి, డీజీపీకి లేఖలు రాస్తున్నారు చంద్రబాబు. అధికారపార్టీ అదేస్థాయిలో కౌంటర్ అటాక్ చేస్తోంది. చంద్రబాబు స్వయంగా కుప్పం మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే.. ఆయన తనయుడు నారా లోకేష్ కూడా అదే పనిలో ఉన్నారు. టీడీపీ సీనియర్ నాయకులంతా కుప్పంలోనే మోహరించారు.

అనంతపురం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వానికి తెర పడింది. జిల్లాలో కీలకమైన పెనుకొండతో పాటు అనంతపురంలోని 17వ డివిజన్ కు ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో కుప్పం తర్వాత పెనుగొండ పైనే అందరి ఫోకస్ ఉంది. దాదాపు యాభై మంది ప్రజాప్రతినిధులు పెనుకొండలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వారం రోజుల పాటు ముమ్మరంగా సాగిన ప్రచారానికి తెర పడింది. ఇక ఎన్నికలను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు పోలీసులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీల అభ్యర్థులు డబ్బులు పంపిణీ చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఇప్పటికే పెనుకొండ కు భారీగా పోలీస్ ఫోర్స్ దిగింది.

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మార్చి నెలలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించింది రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే, గతంలో కోర్టు కేసులు, మరికొన్ని కారణాలతో కొన్నిచోట్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి. దీంతో మిగిలిన 13 చోట్ల రేపు ఆదివారం మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా నెల్లూరు కార్పొరేషన్‌తోపాటు 12 మున్సిపాలిటీలకు ఈ నెల 3న నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈనెల 14, 15, 16 తేదీల్లో ఎన్నికలు జరగున్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 14న పంచాయతీలకు పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజుల సాయంత్రానికి ఫలితాలు వెలువడనున్నాయి. మొత్లం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగిలి పోయిన 498 గ్రామ పంచాయతీల్లో 69 సర్పంచ్‌లకు ఎన్నిక జరుగుతుండగా, మిగిలిపోయిన 533 వార్డు మెంబర్లకు ఎన్నిక జరగనుంది.

అలాగే. ఈనెల 15న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతాయి. ఈనెల 17న పోలైన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు ఎస్ఈసీ పేర్కొంది. ఇందులో భాగంగా 7 కార్పొరేషన్లలో 12 డివిజన్లకు ఎన్నిక జరుగనుంది. ఇక, ఈనెల 16న మిగిలిపోయిన ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఎన్నికలు జరగున్నాయి. ఈ నెల 18న ఓట్ల కౌంటింగ్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇందులో భాగంగా 13 జిల్లాల్లో మిగిలిన 187 ఎంపీటీసీలకు ఎన్నికలు జరుగనున్నాయి. 13 జిల్లాల్లో మిగిలిపోయిన 16 జడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహిస్తారు.

ఏపీలోని నెల్లూరు కార్పొరేషన్‌ ఎన్నికలు మున్సిపాలిటీలు ఇవేః

1. కుప్పం మునిసిపాలిటీ ( చిత్తూరు) 2. బుచ్చిరెడ్డిపాలెం(నెల్లూరు) 3. ఆకివీడు(పశ్చిమగోదావరి) 4. జగ్గయ్యపేట (కృష్ణా) 5. కొండపల్లి(కృష్ణా) 6.దాచేపల్లి ( గుంటూరు) 7. గురజాల(గుంటూరు) 8. దర్శి(ప్రకాశం) 9. బేతంచెర్ల(కర్నూలు), 10. కమలాపురం (కడప) 11. రాజంపేట(కడప ) 12. పెనుకొండ(అనంతపురం)

Read Also…  BJP Millennium March: బీజేపీ నిరుద్యోగ మిలియన్ మార్చ్ వాయిదా.. కారణం అదేనా.. మళ్లీ ఎప్పుడంటే..?