- Telugu News Photo Gallery Business photos Car Loan Interest Rates.. These banks are offering the cheapest car loans
Car Loan Offer: మీరు కొత్త కారు కొనాలనుకుంటున్నారా..? ఈ బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకే రుణం పొందవచ్చు..!
Car Loan Offer: సాధారణంగా పండగ సీజన్‌లో ఆటో మొబైల్ వ్యాపారం జోరుగా సాగుతుంటుంది. కస్టమర్లను ఆకర్షించేందుకు వివిధ బ్యాంకులు పలు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి..
Updated on: Nov 13, 2021 | 5:41 PM

Car Loan Offer: సాధారణంగా పండగ సీజన్‌లో ఆటో మొబైల్ వ్యాపారం జోరుగా సాగుతుంటుంది. కస్టమర్లను ఆకర్షించేందుకు వివిధ బ్యాంకులు పలు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. మీరు కొత్త కారు కొనుగోలు చేయాలనుకుంటే ఇది మంచి అవకాశం. కొన్ని బ్యాంకులు కారు కొనుగోలుపై 90 శాతం వరకు రుణాలు అందిస్తున్నాయి. మీరు కొత్త కారు కొనుగోలు చేయాలంటే ఈ బ్యాంకుల నుంచి రుణాలు పొందవచ్చు.

పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్: ప్రస్తుతం 6.80 నుంచి వడ్డీ రేటు అందిస్తోంది. రూ.లక్ష రుణంపై ఐదేళ్ల కాలానికి రూ.1,971 ఈఎంఐ చెల్లించుకోవచ్చు. అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ప్రస్తుతం ఈ బ్యాంకు డిసెంబర్ 31 వరకు జీరో ప్రాసెసింగ్ రుసుముతో 6.85 వడ్డీ రేటుతో కారు లోన్ పొందవచ్చు. లక్ష రూపాయల రుణానికి ఐదేళ్ల కాలానికి రూ.1,973 ఈఎంఐతో చెల్లించవచ్చు.

ఇండియన్ బ్యాంక్: ఈ బ్యాంకు నుంచి కారు కోసం రుణం తీసుకుంటే 6.90 శాతం వడ్డీ వర్తిస్తుంది. లక్ష రూపాయల రుణం తీసుకుంటే ఐదేళ్ల కాలానికి రూ. 1,975 ఈఎంఐ పెట్టుకోవచ్చు.

బ్యాంక్ ఆఫ్ బరోడా: ఈ బ్యాంకు నుంచి కారు కోసం రుణం తీసుకుంటే 7 శాతం వడ్డీ రేటు ఉంటుంది. ఐదేళ్ల పాటు లక్ష రూపాయల రుణంపై నెలకు రూ.1,980 ఈఎంఐ చెల్లింవచ్చు. అలాగే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర.. ఈ బ్యాంకు 7.05 శాతం వడ్డీ రేటు ఉంటుంది. ఐదేళ్ల కాలానికి లక్ష రూపాయల రుణంపై నెలకు రూ. 1,982 ఈఎంఐ చెల్లింవచ్చు. అలాగే పంజాబ్‌నేషనల్ బ్యాంకు కారు లోన్‌పై 7.30 శాతం ఈఎంఐ వసూలు చేస్తోంది. లక్ష రూపాయల రుణంపై ఐదేళ్ల కాలపరిమితితో నెలకు రూ.1,994 ఉంటుంది.




