Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jay Chaudhry: ఇతను రియల్‌ మహర్షి.. నిరూపేద కుటుంబం నుంచి అమెరికాలో అత్యంత ధనవంతుల జాబితాలోకి.. జే చౌదరి సక్సెస్‌ స్టోరీ..

Jay chaudhry: మహర్షి సినిమాలో మహేష్‌ బాబు నిరుపేద కుటుంబంలో జన్మించి.. కష్టపడి చదివి అమెరికాలో సాఫ్ట్‌వేర్ కంపెనీ స్థాపించే స్థాయికి ఎదుగుతాడు. అయితే ఇది రీల్‌ కథ.. కానీ రియల్‌ లైఫ్‌లోనూ అలాంటి వ్యక్తి ఒకరు ఉన్నారని మీకు తెలుసా.?

Jay Chaudhry: ఇతను రియల్‌ మహర్షి.. నిరూపేద కుటుంబం నుంచి అమెరికాలో అత్యంత ధనవంతుల జాబితాలోకి.. జే చౌదరి సక్సెస్‌ స్టోరీ..
Jay Chaudhry
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 13, 2021 | 5:25 PM

Jay Chaudhry: మహర్షి సినిమాలో మహేష్‌ బాబు నిరుపేద కుటుంబంలో జన్మించి.. కష్టపడి చదివి అమెరికాలో సాఫ్ట్‌వేర్ కంపెనీ స్థాపించే స్థాయికి ఎదుగుతాడు. అయితే ఇది రీల్‌ కథ.. కానీ రియల్‌ లైఫ్‌లోనూ అలాంటి వ్యక్తి ఒకరు ఉన్నారని మీకు తెలుసా.? అమెరికా ఎంతో మంది ఔత్సాహికుల కలల ప్రపంచం. అగ్రరాజ్యంలో మాస్టర్స్‌ చేసి అక్కడ ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం సాధించాలి.. ఇది ఎంతో మంది భారతీయుల స్వప్నం. అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా అమెరికాలోనే కంపెనీలు స్థాపించే స్థాయికి ఎదిగారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5 కంపెనీలను ఏర్పాటు చేసి అత్యంత ధనంతువల జాబితాలో చేరారు. అతనే 62 ఏళ్ల జే చౌదరి. తాజాగా ఫోర్బ్స్‌ విడుదల చేసిన జాబితాలో 16.3 బిలియన్‌ డాలర్ల ఆస్తితో అమెరికాలోని 400 మంది అత్యంత ధనవంతుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. అయితే ఇది అంత ఆశామాషీగా జరిగిన వ్యవహారం కాదు. దీని వెనకాల ఎన్నో ఏళ్ల కృషి ఉంది. హిమాచల్‌ ప్రదేశ్‌లోని ఓ కుగ్రామంలో నిరుపేద రైతు కుటుంబంలో జన్మించిన జే చౌదరి ఈ స్థాయికి ఎలా ఎదిగారు.? ఆయన జీవిత కథేంటో తెలుసుకుందాం..

Jay Chaudhry 1

జే చౌదరీ భారత్‌లోని హిమాచల్‌ ప్రదేశ్‌లో ఉన్న పనోహ్‌ అనే గ్రామంలో జన్మించారు. చౌదరీ జన్మించిననాటికి వారి ఇంట్లో కనీసం కరెంట్‌ కనెక్షన్‌ కూడా లేదు. దీంతో ఈయన ఇంటి బయట చదువుకునే వాడు. జీవితంలో ఎదురైన ప్రతికూల పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. కష్టపడి చదివి ఐఐటీ వారణాసిలో సీటు సంపాదించుకున్నాడు. వారణాసిలో ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేసిన చౌదరీ.. అనంతరం 1980లో అమెరికాలో కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌లో ఎమ్‌ఎస్‌తో పాటు, మార్కెటింగ్‌లో ఎంబీఏను పూర్తి చేశాడు. చదువు పూర్తి చేసుకోగానే చౌదరీకి ఐబీఎమ్‌లో ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత యూనీసిస్‌, ఐక్యూ వంటి సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో 25 ఏళ్లపాటు పనిచేశాడు.

Jay Chaudhry 2

అనంతరం 1996లో అతని భార్య జ్యోతితో కలిసి ఓ చిన్న స్టార్టప్‌ను ప్రారంభించాడు. అలా ఒక్క కంపెనీతో మొదలైన చౌదరీ వ్యాపారం ఐదు కంపెనీలకు విస్తరించింది. ఎయిర్‌ డిఫెన్స్‌, సిఫర్‌ ట్రస్ట్‌, కోర్‌ హార్బర్‌, సెక్యూర్ ఐటీ, జెడ్‌స్కేలర్‌ వంటి కంపెనీలను విజయవంతంగా ఏర్పాటు చేశారు. క్లౌడ్‌ టెక్నాలజీతో నడిచే జెడ్‌ స్కేలర్‌ కంపెనీ చౌదరీని ఒకే అత్యంత ధనవంతుడిగా మార్చేసింది. ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన చౌదరీ.. ‘నేను జెడ్‌ స్కేలర్‌ కంపెనీని ప్రారంభించే సమయంలో మార్కెట్‌ క్లౌడ్‌ టెక్నాలజీకి సిద్ధంగా లేదు. మొదట్లో క్లౌడ్‌ టెక్నాలజీకి చాలా సమయం, డబ్బు ఖర్చయింది. కానీ ప్రస్తుతం ఈ రంగంలో మేమే మొదటి స్థానంలో ఉన్నాం’అని చెప్పుకొచ్చాడు. చౌదరీ స్థాపించిన కంపెనీలను కొన్ని ఇతర బడా కంపెనీలకు విక్రయించడంతో ఆయన కొన్ని లక్షల కోట్లను ఆర్జించారు. ఇలా భారత్‌లోని ఓ కుగ్రామంలో మొదలైన చౌదరీ ప్రస్థానం నేడు దేశం గర్వించే స్థాయికి ఎదగడం నిజంగా వండర్‌ కదూ.!

Jay Chaudhry 3

Also Read: PV Sindhu: ‘ చీరలో ఎంత సక్కగుందో’… పీవీ సింధు ధరించిన శారీ గురించి ఆసక్తికర విషయాలు

Emotional Video: ‘గుండె నిండా ఆవేదన.. ఎవరికి పట్టును ఈ ఆక్రందన’.. కన్నీరుమున్నీరైన రైతు

Rashmika: వయసు అనేది అసలు సమస్యే కాదు.. డేటింగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రష్మిక..

ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌