Emotional Video: ‘గుండె నిండా ఆవేదన.. ఎవరికి పట్టును ఈ ఆక్రందన’.. కన్నీరుమున్నీరైన రైతు
ఆరుగాలం కష్టపడి పండించిన పంట. ఒక్కసారిగా నీట మునిగిపోయింది. ఈ క్రమంలో పొలానికి వెళ్లిన రైతు గుండె ముక్కలయ్యింది.
ఆరుగాలం కష్టపడి పండించిన పంట. ఒక్కసారిగా నీట మునిగిపోయింది. ఈ క్రమంలో పొలానికి వెళ్లిన రైతు గుండె ముక్కలయ్యింది. చిన్న పిల్లాడిలా గుక్కెట్టి ఏడ్చాడు. గుండెలు బాదుకున్నాడు. కోసిన తర్వాత పంట నీట మునిగిపోవడంతో పొలంలోనే వెక్కి వెక్కి వేశాడు. ఏ ప్రాంతానికి సంబంధించినదో తెలియదు కానీ ఇప్పుడు ఈ వీడియో కోనసీమ ప్రాంతంలో సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అవుతుంది.
అకాల వర్షాలు గోదావరి జిల్లాల రైతాంగంపై తీవ్ర ప్రభావం చూపాయి. పంటలు చేతికి అంది వచ్చిన సమయంలో కురిసిన వర్షాలు అన్నదాతను నిండా ముంచాయి. ఎకరాకు 20 నుండి 25 వేలు వరకు పెట్టుబడులు పెట్టిన రైతులకు చివరకు పంటలు నీటిపాలు కావడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అధికారులు తక్షణం స్పందించి పంట నష్టాలను అంచనా వేసి రైతులను ఆదుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఈ ఏడాది వరుస విపత్తులతో రైతులు పడుతున్న ఇబ్బందులు చూసి ప్రతి ఒక్కరూ ‘అయ్యో రైతన్న’ అంటూ చలించి పోతున్నారు. గోదావరి వరదలు, వరుస వర్షాలతో వరి, పత్తి చేలు నీట మునిగి.. పంట కళ్ల ముందే పాడవుతుంటే రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ ఏడాది విత్తు నాటిన దగ్గర నుండి మొక్క పెరిగే వరకు ఏదో ఒక విపత్తుతో వరి, పత్తి చేలు దెబ్బతింటున్నాయి. గోదావరి వరదలు పలుమార్లు పంటపొలాలను ముంచెత్తాయి. అధిక వర్షాలకు పలుమార్లు వాగులు, వంకలు పొంగి వరి, పత్తి చేలు నాశనం అయిపోయాయి.
Also Read: ఏపీకి మరో తుఫాన్ ముప్పు.. హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ