PV Sindhu: ‘ చీరలో ఎంత సక్కగుందో’… పీవీ సింధు ధరించిన శారీ గురించి ఆసక్తికర విషయాలు

చీరలోని గొప్పదనం తెలుసుకో అన్నాడో సినీ కవి.. అది అక్షరాల నిజమే .. ఎన్ని ఫ్యాషన్‌ డ్రెస్సులు వచ్చినా అమ్మాయిలు చీరకట్టులో చాలా అందంగా ఉంటారు.

PV Sindhu: ' చీరలో ఎంత సక్కగుందో'... పీవీ సింధు ధరించిన శారీ గురించి ఆసక్తికర విషయాలు
Pv Sindhu
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 13, 2021 | 4:29 PM

చీరలోని గొప్పదనం తెలుసుకో అన్నాడో సినీ కవి.. అది అక్షరాల నిజమే .. ఎన్ని ఫ్యాషన్‌ డ్రెస్సులు వచ్చినా అమ్మాయిలు చీరకట్టులో చాలా అందంగా ఉంటారు. తాజాగా బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు కూడా చీరకట్టులో ఉన్న గొప్పదనాన్ని మరోసారి అందరికీ గుర్తు చేశారు. చీరకట్టులో నిండుదనం ఉందంటున్నారు. ఇటీవల రాష్ట్రపతి నుంచి పద్మభూషన్ అవార్డు అందుకున్నారు పీవీ సింధు. ఈ సందర్భంగా అచ్చ తెలుగు చీరకట్టుతో అవార్డ్‌ కార్యక్రమానికి హాజరయ్యారు పీవీ సింధు. పీవీ సింధుకు చీరలు ధరించడం అంటే చాలా ఇష్టం. భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా ఉండే చీరలను ముఖ్యమైన సందర్భాల్లో ధరిస్తారు పీవీ సింధు. హైదరాబాద్‌లో బోనాల పండగ సందర్భంలో కూడా పీవీ సింధు చీర ధరించారు. ఇప్పుడు రాష్ట్రపతి నుంచి ప్రతిష్టాత్మక పద్మభూషన్‌ అవార్డ్‌ అందుకునే సమయంలో కూడా చీరలో కనిపించారు పీవీ సింధు.

పీవీ సింధు ధరించిన చీర ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సింధు ధరించిన చీర పేరు పటోలా. దీనికి పెద్ద చరిత్రే ఉంది. రెండు వైపులా ఒకేలా కనిపించడం ఈ చీర ప్రత్యేకత. తయారు చేసిన వ్యక్తి కూడా ఏది ముందు భాగమో.. ఏది వెనుక భాగమో గుర్తించలేరు. అయితే చీరపై ఉన్న మమకారంతోనే పద్మ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమానికి పటోలా చీరలో వచ్చింది సింధు.

2016 రియో ఒలింపిక్స్‌లో సిల్వర్‌ మెడల్‌ సాధించిన సింధు, 2021 టోక్యోలో జరిగిన ఒలింపిక్స్‌లో బ్రాంజ్‌ మెడల్‌ సాధించి భారతదేశ పతాకాన్ని అంతర్జాతీయ వేదికలపై రెపరెపలాడించింది. 2015లో సింధుకు పద్మశ్రీ అవార్డ్‌ రాగా, ఈ ఏడాది ప్రతిష్టాత్మకమైన పద్మభూషన్‌ అవార్డ్‌ వరించింది.

Also Read: ‘గుండె నిండా ఆవేదన.. ఎవరికి పట్టును ఈ ఆక్రందన’.. కన్నీరుమున్నీరైన రైతు

ఏపీకి మరో తుఫాన్ ముప్పు.. హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ